Rayachoti: 'హర్ ఘర్ తిరంగా' ర్యాలీ.. పాల్గొన్న ఎమ్మెల్సీ సోము వీర్రాజు!
Rayachoti: అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఘనంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీ. జాతీయ జెండా చేతబూని 2 కి.మీ నడిచిన బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు.
Rayachoti: 'హర్ ఘర్ తిరంగా' ర్యాలీ.. పాల్గొన్న ఎమ్మెల్సీ సోము వీర్రాజు!
Rayachoti: అన్నమయ్య జిల్లా రాయచోటిలో శుక్రవారం హర్ ఘర్ తిరంగా ర్యాలీ ఘనంగా నిర్వహించారు పట్టణంలోని విద్యాసంస్థలు కూటమి నాయకులు పుర ప్రజలు భారీగా హాజరై ర్యాలీని పట్టణ నడిబొడ్డులోని ప్రధాన రహదారులలో నిర్వహించారు పట్టణంలోని జాతీయ రహదారి శివాలయం కూడలు నుంచి నేతాజీ కూడలి ఆర్టీసీ బస్టాండ్ రోడ్డు టానా మీదుగా ర్యాలీ కొనసాగింది నేతాజీ కూడలిలో మానవహారం నిర్వహించారు యువత పురవాసులు వందేమాతరం భారత్ మాతాకీ జై అంటూ ర్యాలీలో నినదించారు.
భారతీయ జనతా పార్టీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్సీ సోము వీర్రాజు హర్ ఘర్ తిరంగా ర్యాలీలో జెండా చేత పట్టుకొని సుమారు రెండు కిలోమీటర్ల మేర యువత జనంతో కలిసి నడిచారు ప్రధాని ఇచ్చిన పిలుపు మేరకు దేశ ఐక్యతను చాటేలా ఘర్ ఘర్ తిరంగా ర్యాలీలు కొనసాగడం స్లాగనీయమని ఆయన తెలిపారు.
అమరావతిలో జరిగే హర్ ఘర్ తిరంగా ర్యాలీకి సీఎం చంద్రబాబు నేతృత్వం వహించడం రాష్ట్ర సమైక్యతకు నాంది అని సోము వీర్రాజు అన్నారు జాతీయ దేశం సమైక్యత కోసం భారతమాతను ప్రతి ఒక్కరు గౌరవించాల్సిన అవసరం ఉందని తెలిపారు దేశవ్యాప్తంగా స్వతంత్ర వేడుకలు 14వ తేదీనే మొదలు కావడం దేశ సౌభాతృత్వం సమైక్యతకు నిదర్శనమని ఆయన తెలియజేశారు కార్యక్రమంలో కూటమి నాయకులు విద్యార్థులు యువత పాల్గొన్నారు.