Proddatur: జాతీయ నృత్య పోటీల్లో ప్రొద్దుటూరు బాలిక సత్తా.. 3వ స్థానం!

కడప జిల్లా: ప్రొద్దుటూరు పట్టణం వై.ఎం.ఆర్ కాలనీకి చెందిన కె. శ్రియ రెడ్డి నృత్య జాతీయ స్థాయిలో మెరిసింది. హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని భారతీయ విద్యాభవన్ ఆడిటోరియంలో జరిగిన 25వ అఖిల భారత సాంస్కృతిక నృత్య పోటీలలో శ్రియ రెడ్డి పాల్గొంది. ​కూచిపూడి సోలో సీనియర్ విభాగంలో తన అద్భుతమైన నాట్య ప్రదర్శనతో న్యాయనిర్ణేతలను ఆకట్టుకుని మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది.

గండ్లూరు వీర ప్రతాప్ రెడ్డి మనవరాలైన, కె. రామాంజనేయులు రెడ్డి - హరితారెడ్డి దంపతుల కుమార్తె. జాతీయ వేదికపై తమ కుమార్తె కె. శ్రీయ రెడ్డి సాధించిన ఈ ఘనత పట్ల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శ్రియ రెడ్డి మరిన్ని విజయాలు సాధించాలని స్థానిక కళాభిమానులు అభినందనలు తెలిపారు.

Tags: