Proddatur: ప్రొద్దుటూరు ఎంపీపీగా కొప్పల్ల భారతి ఏకగ్రీవ ఎన్నిక!
Proddatur: వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు మండల పరిషత్ అధ్యక్షురాలిగా కామనూరు టీడీపీ ఎంపీటీసీ కొప్పల్ల భారతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. టీడీపీ నేతలు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.
Proddatur: ప్రొద్దుటూరు ఎంపీపీగా కొప్పల్ల భారతి ఏకగ్రీవ ఎన్నిక!
ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు ఏకగ్రీవంగా ముగిశాయి. ప్రొద్దుటూరు ఎంపీపీగా కామనూరు టీడీపీ ఎంపీటీసీ కొప్పల్ల భారతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. టీడీపీ సీనియర్ నేత లక్ష్మిరెడ్డి కోడలైన కొప్పల్ల భారతి ఎంపీపీగా బాధ్యతలు చేపట్టడం పట్ల పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
ఈ సందర్భంగా ప్రొద్దుటూరు మున్సిపాలిటీ 48వ వార్డు కౌన్సిలర్ యనమల సుబ్బిరెడ్డి, ప్రొద్దుటూరు మండల జడ్పీటీసీ బచ్చల ప్రతాప్ ఆమెకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన ఎంపీపీని అభినందించారు.