Rayachoti: గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై సీఎం సమీక్ష పాల్గొన్న మంత్రి!

Rayachoti: 2027 గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు నిర్వహించిన వర్చువల్ సమీక్షలో మంత్రి పాల్గొన్నారు. భక్తుల సౌకర్యాలపై సీఎం ఆదేశాలు జారీ చేశారు.

Update: 2026-08-25 09:11 GMT

Rayachoti: గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై సీఎం సమీక్ష పాల్గొన్న మంత్రి!

Rayachoti: 2027 గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వర్చువల్ గా నిర్వహించిన సమీక్ష సమావేశంలో రాష్ట్ర రవాణా, యువజన, క్రీడల శాఖల మంత్రి శ్రీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు వర్చువల్‌గా పాల్గొన్నారు.

పుష్కరాలకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో రవాణా, ట్రాఫిక్ నియంత్రణ, రహదారుల అభివృద్ధి, భద్రత, భక్తులకు అవసరమైన మౌలిక వసతుల కల్పన తదితర అంశాలపై సమావేశంలో సమీక్షించారు. వివిధ శాఖల ఆధ్వర్యంలో చేపడుతున్న పనుల పురోగతి, భవిష్యత్ కార్యాచరణపై ముఖ్యమంత్రి అధికారులకు పలు సూచనలు చేశారు. పుష్కరాలను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు.

Tags:    

Similar News