Sundupalle: లెక్చరర్ దాడి MNR జూనియర్ కళాశాల గుర్తింపు రద్దు చేయాలి!
Sundupalle: సుండపల్లె MNR జూనియర్ కళాశాలలో విద్యార్థిపై లెక్చరర్ దాడి. కళాశాల గుర్తింపు రద్దు చేయాలని గిరిజన స్టూడెంట్స్ ఫెడరేషన్ అధ్యక్షులు నాగేంద్ర డిమాండ్.
Sundupalle: లెక్చరర్ దాడి MNR జూనియర్ కళాశాల గుర్తింపు రద్దు చేయాలి!
Sundupalle: సుండపల్లె మండల పరిధిలోని పీలేరు రోడ్డులోని ఇండియన్ పెట్రోల్ బంక్ వెనుక భాగంలో ఉన్న ఎంఎన్ఆర్ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న ముస్పర్ అనే విద్యార్థిపై లెక్చరర్ దాడి చేశారంటూ విద్యార్థి తల్లిదండ్రులు ఆరోపించారని గిరిజన స్టూడెంట్స్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు నాగేంద్ర నాయక్ చౌహన్ తెలిపారు. సోమవారం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తరగతి గదిలో తోటి విద్యార్థుల సమక్షంలో అసభ్య పదజాలంతో దూషిస్తూ విద్యార్థిపై విచక్షణారహితంగా దాడి చేసినట్లు వారు పేర్కొన్నారు.
విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పి, వారి భద్రతను కాపాడాల్సిన లెక్చరర్ ఈ విధంగా వ్యవహరించడం తీవ్రంగా ఖండించాల్సిన విషయమని గిరిజన స్టూడెంట్స్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పేర్కొంది. విద్యార్థిపై దాడి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న లెక్చరర్‌పై సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.
అదేవిధంగా విద్యార్థుల భద్రతకు భంగం కలిగించే ఘటనలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో ఎంఎన్ఆర్ జూనియర్ కళాశాల గుర్తింపును రద్దు చేయాలని గిరిజన స్టూడెంట్స్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. విద్యార్థుల సమస్యలపై అధికారులు వెంటనే స్పందించి, ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని కోరారు. విద్యార్థిపై దాడి చేసిన లెక్చరర్‌పై చర్యలు తీసుకోవడంతో పాటు కళాశాల గుర్తింపు రద్దు చేసే వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని ఆయన తెలిపారు.