Rayachoti: అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారికి అండగా డాక్టర్ !
Rayachoti: రాయచోటి వాల్మీకి వీధికి చెందిన అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారి కుటుంబానికి డాక్టర్ మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి మండిపల్లి నాగిరెడ్డి.
Rayachoti: అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారికి అండగా డాక్టర్ !
Rayachoti: అనారోగ్యంతో బాధపడుతున్న బాలికకు అండగా డా,,మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి
రూ.20 వేల ఆర్థిక సహాయం అందజేత...
పాత రాయచోటి వాల్మీకి వీధిలో నివాసం ఉంటున్న చింతల శ్రీనివాసుల కుమార్తె అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ నాయకులు డాక్టర్ మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి గారు మానవతా దృక్పథంతో స్పందించారు.
మండిపల్లి నాగిరెడ్డి మెమోరియల్ ట్రస్టు ద్వారా తన సొంత నిధుల నుంచి రూ.20,000 ఆర్థిక సహాయాన్ని బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా చిన్నారి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.
ఆపదలో ఉన్న కుటుంబాలకు అండగా నిలవడం తన బాధ్యతగా భావిస్తున్నట్లు డా. మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి గారు తెలిపారు. ఈ ఆర్థిక సహాయం అందించినందుకు చింతల శ్రీనివాసుల కుటుంబ సభ్యులు ఆయనకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.