Proddatur: ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్‌ను కలిసిన కౌన్సిలర్లు!
Proddatur: కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపాలిటీ కమిషనర్‌ను 19, 20వ వార్డుల కౌన్సిలర్లు మర్యాదపూర్వకంగా కలిసి తమ వార్డుల్లోని ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరారు.
Proddatur: ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్‌ను కలిసిన కౌన్సిలర్లు!
ప్రొద్దుటూరు: కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపాలిటీ కమిషనర్‌ను నేడు 19వ వార్డు కౌన్సిలర్ వైఎస్ హరీఫ్ హుస్సేన్, 20వ వార్డు వైఎస్ ముజాయిద్దీన్, రిటైర్డ్ ఎస్సై శంకర్ రావు, మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కమిషనర్‌కు పూలబొకే అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం తమ వార్డులలో నెలకొన్న పలు ప్రజా సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కమిషనర్, సంబంధిత అధికారులకు తక్షణమే ఆదేశాలు జారీ చేశారు. వార్డు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సమస్యలను సత్వరమే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.