Kadapa: సీఐ ప్రసాద్ రావుపై బీజేపీ నేత విజయ్ సంచలన వ్యాఖ్యలు!
Kadapa: కడప నగరంలో బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి బొమ్మన విజయ్ ప్రెస్ మీట్ నిర్వహించారు.
Kadapa: సీఐ ప్రసాద్ రావుపై బీజేపీ నేత విజయ్ సంచలన వ్యాఖ్యలు!
కడప: నగరంలో బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి బొమ్మన విజయ్ ప్రెస్ మీట్. కామెంట్స్. ఈ మధ్య కాలం లో ఆల్మస్ పేట సర్కిల్ లో అల్లర్లు జరిగాయి. రెండు మతాల మధ్య గొడవలు జరిగాయి. అనంతరం జిల్లా కలెక్టర్, ఎస్పీ ఆధ్వర్యంలో పీస్ కమిటీ మీటింగ్ జరిగింది.
పీస్ కమిటీ మీటింగ్ లో అధికారులు చెప్పిన విధంగా స్వచ్చందంగా బ్యానర్లు తొలగించడం జరిగింది. హనుమాన్ జయంతి రోజు ఎటువంటి ర్యాలీ చేయలేదు. 12 వ తేదీ హనుమాన్ జయంతి రోజున ఆల్మస్ పేట సర్కిల్ వద్ద టూ టౌన్ సిఐ ప్రసాద్ రావు నన్ను స్టేషన్ కు తరలించారు. తెల్లవారుజామున నుంచి రాత్రి వరకు స్టేషన్ లో ఉంచారు. వారు అడిగిన ప్రతి విషయానికి సమాధానం చెప్పాను.
బీజేపీ రాష్ట్ర పెద్దలు చెప్పిన అనంతరం నన్ను స్టేషన్ నుంచి పంపించారు. నాకు సంబంధించిన సెల్ ఫోన్ ఇప్పటివరకు టూ టౌన్ స్టేషన్ లోనే ఉంది. నా మొబైల్ లాక్ పాస్ వర్డ్ కూడా పోలీసులకు చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు సిఐ నా మొబైల్ ఇవ్వకుండా నా వ్యక్తిగత సమాచారం సేకరిస్తున్నారు. నా మొబైల్ చెక్ చేసుకోవాలని టూ టౌన్ సిఐ కూడా చెప్పడం జరిగింది. నేను మత విద్వేషాలు ఎక్కడా రెచ్చగొట్టలేదు.