Pulivendula: పులివెందులలో హైటెన్షన్ ఏకకాలంలో కొనసాగుతున్న ఈడీ తనిఖీలు!

Pulivendula: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఈడీ సోదాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. మనీలాండరింగ్ కోణంలో వైఎస్సార్సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి సహా పలువురి

Update: 2026-08-21 08:08 GMT

Pulivendula: పులివెందులలో హైటెన్షన్ ఏకకాలంలో కొనసాగుతున్న ఈడీ తనిఖీలు!

Pulivendula: కడప జిల్లా పులివెందులలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది... వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది... మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు చేపట్టిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు... పులివెందులలో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు.

వైఎస్ అవినాష్ రెడ్డి... దేవిరెడ్డి... శివశంకర్ రెడ్డి... డ్రైవర్ దస్తగిరి... సునీల్ యాదవ్... ఎర్ర గంగిరెడ్డి ఇళ్లలో ఈడీ అధికారులు తనిఖీలు కొనసాగిస్తున్నారు. మరోవైపు... హైదరాబాద్‌లోనూ రెండు ప్రాంతాల్లో ఈడీ సోదాలు కొనసాగుతున్నట్లు సమాచారం.

పలు ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు జరుగుతుండటంతో పులివెందులలో ఉత్కంఠ నెలకొంది. ఈడీ అధికారులకు భద్రత కల్పించేందుకు సీఆర్‌పీఎఫ్ బలగాలను రంగంలోకి దించినట్లు సమాచారం.

అసలు ఈ సోదాల వెనుక కారణం ఏంటి? వివేకా హత్య కేసుకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారా? మనీలాండరింగ్ కోణంలో ఏమైనా కీలక ఆధారాలు లభించాయా? ప్రస్తుతం ఇదే అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

పులివెందుల నుంచి హైదరాబాద్ వరకు... ఏకకాలంలో కొనసాగుతున్న ఈడీ సోదాలు రాజకీయంగానూ తీవ్ర ప్రాధాన్యత సంతరించుకున్నాయి. సోదాలు పూర్తయ్యే వరకు ఏం బయటకు వస్తుందన్నది ఉత్కంఠగా మారింది... ఈడీ అధికారులు ఎలాంటి కీలక పత్రాలు, ఆధారాలు స్వాధీనం చేసుకున్నారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News