Kadapa: కొత్త ఓటర్ల జాబితాతోనే స్థానిక ఎన్నికలు: అంజాద్ బాషా!
Kadapa: ఎస్‌ఐఆర్ ప్రక్రియ పూర్తయ్యాక విడుదలయ్యే కొత్త ఓటర్ల జాబితా ఆధారంగానే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా కడపలో డిమాండ్ చేశారు.
Kadapa: కొత్త ఓటర్ల జాబితాతోనే స్థానిక ఎన్నికలు: అంజాద్ బాషా!
కడప: కొత్త ఓటర్ల జాబితా ఆధారంగానే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా డిమాండ్ చేశారు. కడపలో అంజాద్ బాషా మీడియాతో మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కొనేందుకు వైఎస్సార్‌సీపీ శ్రేణులు, కార్యకర్తలు పూర్తిగా సిద్ధంగా ఉన్నారని తెలిపారు.కడపలో గతంలో 2.87 లక్షలుగా ఉన్న ఓటర్ల సంఖ్య SIR తర్వాత 2.17 లక్షలకు పడిపోయిందన్నారు.
కడప నియోజకవర్గంలో సుమారు 67 వేల ఓట్లు తొలగించారని, 77 వేల మంది ఓటర్లకు నోటీసులు ఇచ్చారని తెలిపారు.సరైన ఓటర్ల జాబితా లేకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే భవిష్యత్‌లో న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉందని అన్నారు.ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయిన తర్వాత కొత్తగా విడుదలయ్యే ఓటర్ల జాబితా ఆధారంగానే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని మాజీ ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా డిమాండ్ చేశారు.