Lakkireddypalle: విద్యుత్ షాక్‌తో 15 గొర్రెలు మృతి!
Lakkireddypalle: అన్నమయ్య జిల్లా దేవలంపల్లెలో ఇనుప కంచెకు విద్యుత్ సరఫరా అయి 15 గొర్రెలు మృతి. రూ.3 లక్షల నష్టం, ఆదుకోవాలని రైతు వినతి.
Lakkireddypalle: విద్యుత్ షాక్‌తో 15 గొర్రెలు మృతి!
Lakkireddypalle: అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లె మండలం దేవలంపల్లె లో విద్యుత్ షాక్ తో 15 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. గొర్రెలకు కాపలా గా ఏర్పాటు చేసిన ఇనుప కంచకు విద్యుత్ సరఫరా కావడంతో ప్రమాదవశాత్తు ఇనుప కంచెను తగులుకొని 15 గొర్రెలు మృతి చెందాయి.
గొర్రెల మృతితో దాదాపు మూడు లక్షల పైబడి తీవ్ర నష్టం వాటిలిందని గొర్రెల యజమాని వీరాంజనేయులు వాపోతున్నాడు. తమకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేసి ఆదుకోవాలని బాధితుడు కోరుతున్నారు.