Kadapa: కడపలో డ్రైవర్ దారుణ హత్య.. అటవీ ప్రాంతం లో మృతదేహం లభ్యం!

Kadapa: కడపలో డ్రైవర్ అక్కుపల్లి వంశీ దారుణ హత్య. 10వ తేదీన యజమానితో బయటకు వెళ్లి అదృశ్యమైన వంశీ, ఒంటిమిట్ట అటవీ ప్రాంతంలో మృతదేహంగా లభ్యం.

Update: 2026-06-13 08:23 GMT

Kadapa: కడపలో డ్రైవర్ దారుణ హత్య.. అటవీ ప్రాంతం లో మృతదేహం లభ్యం!

కడప జిల్లా: కడప నగరంలోని రిమ్స్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన అక్కుపల్లి వంశీ (25) హత్యకు గురైన ఘటన కలకలం రేపింది. ఈ నెల 10న యజమాని చింతా రామసుబ్బారెడ్డితో బయటకు వెళ్లిన వంశీ కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు రెండు రోజుల తర్వాత ఒంటిమిట్ట మండలం సాలాబాద్ సమీప అటవీ ప్రాంతంలో వంశీ మృతదేహాన్ని గుర్తించారు. మృతదేహంపై గాయాలు ఉండటంతో ఇది హత్యగా ప్రాథమికంగా నిర్ధారించారు. ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Tags:    

Similar News