Rayachoti: సర్పంచ్ ఎన్నికలపై కార్యకర్తలకు మంత్రి మండిపల్లి దిశానిర్దేశం!
Rayachoti: రాయచోటి మదనపల్లె రోడ్డులోని పి.సి.ఆర్ ఫంక్షన్ హాల్లో టీడీపీ నాయకులు, కార్యకర్తలతో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సమావేశమై సర్పంచ్ ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు.
Rayachoti: సర్పంచ్ ఎన్నికలపై కార్యకర్తలకు మంత్రి మండిపల్లి దిశానిర్దేశం!
రాయచోటి: రాయచోటి నియోజకవర్గంలోని మదనపల్లె రోడ్డులో ఉన్న పి.సి.ఆర్. ఫంక్షన్ హాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో మంత్రిమండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ, ప్రస్తుత పరిస్థితులు, పార్టీ తరఫున అనుసరించాల్సిన వ్యూహాలపై కార్యకర్తలతో సమగ్రంగా చర్చించారు.
ప్రతి గ్రామంలో పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని, అభ్యర్థుల ఎంపిక నుంచి నామినేషన్ ప్రక్రియ వరకు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. గ్రామస్థాయిలో పార్టీ శ్రేణులంతా ఐకమత్యంతో ముందుకు సాగుతూ, ప్రజల మద్దతుతో రాబోయే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు దిశానిర్దేశం చేశారు.