kalibanda: కలిబండ గ్రామంలో నూతన బస్సు షెల్టర్‌ను ప్రారంభించిన హరితమ్మ

kalibanda: అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలం కలిబండ గ్రామంలో నూతన బస్సు షెల్టర్‌ను మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సతీమణి హరితమ్మ గారు ప్రారంభించారు.

Update: 2026-08-01 14:10 GMT

kalibanda: కలిబండ గ్రామంలో నూతన బస్సు షెల్టర్‌ను ప్రారంభించిన హరితమ్మ

కలిబండ: అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం చిన్నమండెం మండలం కలిబండ గ్రామంలో నూతనంగా నిర్మించిన బస్సు షెల్టర్‌ను మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి సతీమణి శ్రీమతి హరితమ్మ గారు ప్రారంభించారు.

ఈ సందర్భంగా హరితమ్మ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణ వాతావరణం కల్పించేలా ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో చిన్నమండెం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మూగిరెడ్డప్ప గారు, పెద్దిరెడ్డి గారు, స్థానిక పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, మహిళలు మరియు ప్రజలు పాల్గొన్నారు.

Tags:    

Similar News