Nellore: నరకప్రాయంగా సోమశిల ప్రయాణం.. గుంతలమయమైన రోడ్లపై వాహనదారుల అవస్థలు!

Nellore: అనంతసాగరం మండలంలోని సోమశిల రోడ్డు గుంతలమయమై వాహనదారుల ప్రయాణం నరకప్రాయంగా మారింది.

Update: 2026-04-03 08:10 GMT

Nellore: నరకప్రాయంగా సోమశిల ప్రయాణం.. గుంతలమయమైన రోడ్లపై వాహనదారుల అవస్థలు!

అనంతసాగరం: ఆత్మకూరు సోమశిల రోడ్ అధ్వానంగా తయారయింది. మరి ముఖ్యంగా అనంతసాగరం మండలంలోని పీడీపల్లి, మంచాల పల్లి, పడమటి కంభంపాడు, సోమశిల ప్రాంతాల వాహన చోదకుల ప్రయాణం నరకప్రాయంగా మారింది. ఇటీవల కురిసిన వర్షాలకు సోమశిల అనంతసాగరం మధ్య వాహన శోధకులు ప్రయాణించాలంటేనే ప్రాణం గుప్పిట్లో పెట్టుకుని వెళుతున్నారు.

ఆర్టీసీ బస్సులు సైతం సోమశిల వరకు వెళ్లకుండా ఉప్పలపాడు వరకు వెళ్లి తిరిగి ఆత్మకూరు వస్తున్నారంటే ఆ రోడ్డు పరిస్థితి ఎలా ఉందో ఓసారి ప్రజా ప్రతినిధులు, అధికారులు చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయా గ్రామాల ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక సోమశిల - కలువాయి మార్గం కూడా ఇలానే ఉంది జలాశయం పరిసర ప్రాంతాలలో ఇటీవల భారీ వరదల నేపథ్యంలో రోడ్లు మొత్తం దెబ్బతిన్నాయని కలువాయి వెళ్లాలంటేనే భయం వేస్తుందని ప్రయాణికులు ఆవేదన చెందుతున్నారు. కావున స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి రోడ్డుకు కనీసం మరమ్మత్తులైన చేయాలని ఆయా గ్రామాల ప్రజలు వేడుకుంటున్నారు

Tags:    

Similar News