Iran War: ఇరాన్‌ యుద్ధంలో ఈ మలుపు నిజమేనా... రష్యా, చైనాలు ట్రంప్‌కు హామీ ఇచ్చాయా?

iran-war-russia-china-assured-trump-no-arms-support

Update: 2026-07-25 05:23 GMT

Iran War: పశ్చిమాసియా యుద్ధంలో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా పెద్ద చర్చనీయాంశమయ్యాయి. ఇరాన్‌కు రష్యా, చైనాలు ఎలాంటి ఆయుధాలు గానీ, సైనిక సహకారం గానీ అందించవని ఆయా దేశాల అగ్రనేతలు తనకు స్పష్టమైన హామీ ఇచ్చారని ట్రంప్ వెల్లడించారు.

ట్రంప్‌కు రష్యా, చైనాల హామీలు

ఇటీవల చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో బీజింగ్‌లో జరిగిన భేటీలో, చైనాకు చెందిన ఏ కంపెనీ కూడా ఇరాన్‌కు ఆయుధాలు విక్రయించదని ఆయన హామీ ఇచ్చారని ట్రంప్ తెలిపారు. అలాగే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా ఇరాన్‌కు ఆయుధ సరఫరా చేయనని తనతో చెప్పినట్లు పేర్కొన్నారు. రష్యా, చైనాలు ఇరాన్‌కు ప్రత్యక్షంగా సహకరించడం లేదని నేను నమ్ముతున్నాను. ఒకవేళ ఆ దేశాలు జోక్యం చేసుకుంటే అది వారికే తీవ్ర నష్ట కలిగిస్తుంది అని ట్రంప్ హెచ్చరించారు. ఇక, వైట్‌హౌస్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. తాను ఆ ఇద్దరు నేతల మాటలను విశ్వసిస్తున్నానని ట్రంప్ పునరుద్ఘాటించారు.

అమెరికా రక్షణ శాఖ భిన్నమైన ప్రకటన

ట్రంప్ ప్రకటన ఒకవైపు ఉంటే, అమెరికా రక్షణ కార్యదర్శి పీట్ హెగ్‌సేత్ సినేట్ కమిటీ విచారణలో భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రష్యా, చైనాలు భిన్న స్థాయిల్లో ఇరాన్ చర్యలకు సహకరిస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఒకవైపు ట్రంప్ అధినేతల హామీలను విశ్వసిస్తుంటే, అమెరికా రక్షణ, నిఘా వర్గాలు మాత్రం క్షేత్రస్థాయిలో రష్యా, చైనాల పాత్రపై అనుమానాలు వ్యక్తం చేస్తుండటం గమనార్హం. ఎవరిమాట నమ్మాలో, ఎవరు చెబుతున్నది నిజమో తెలియక పాపం ప్రజలు అయోమయంలో పడిపోయారు.

క్షేత్రస్థాయి నిజాలు

అంతర్జాతీయ కథనాల ప్రకారం ఇరాన్‌కు రష్యా, చైనాల నుంచి పరోక్ష సహకారం అందుతోందని అమెరికా నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. రష్యా తన ఉపగ్రహాల ద్వారా అమెరికా బలగాల కదలికలకు సంబంధించిన సమాచారాన్ని ఇరాన్‌కు చేరవేస్తోందని మార్చి నెలలో కథనాలు వచ్చాయి. మే నెలలో ఇరాన్ వినియోగించిన సుదూర లక్ష్యాలను గుర్తించే రాడార్లు, మిసైళ్లలో చైనా సాంకేతికత ఉందనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అంతేకాదు, ఇరాన్ ఆయుధ సేకరణకు సహకరిస్తున్న రష్యా, చైనాలకు చెందిన పలు సంస్థలపై అమెరికా ఇప్పటికే ఆంక్షలు విధించింది. అగ్రరాజ్యాల హామీలు ఒకవైపు ఉన్నప్పటికీ, పశ్చిమాసియా ఘర్షణల్లో రష్యా-చైనాల పరోక్ష పాత్ర అంతర్జాతీయ నైతిక సమతుల్యతను మార్చే పెద్ద మలుపుగా విశ్లేషకులు భావిస్తున్నారు.  

Tags:    

Similar News