French President: హీరోయిన్‌తో దేశ ప్రధాని రిలేషన్.. భార్యకు అడ్డంగా దొరికిపోవడంతో..

French President: ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రాన్, ఆయన భార్య బ్రిగిట్టే మధ్య గొడవకు ఇరాన్ నటి కారణమని ఓ పుస్తకం సంచలన విషయాలను బయటపెట్టింది.

Update: 2026-05-15 02:59 GMT

French President: హీరోయిన్‌తో దేశ ప్రధాని రిలేషన్.. భార్యకు అడ్డంగా దొరికిపోవడంతో..

Golshifteh Farahani: ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రాన్ వ్యక్తిగత జీవితం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‍గా మారింది. ముఖ్యంగా ఆయనకు, ఆయన భార్య బ్రిగిట్టేకు మధ్య జరిగినట్లు చెబుతున్న ఒక చెంపదెబ్బ సీన్ వెనుక ఉన్న అసలు కారణాలు ఇప్పుడు సంచలనంగా మారాయి. గతేడాది వియత్నాం పర్యటనలో విమానం దిగుతున్న సమయంలో బ్రిగిట్టే తన భర్తను నెట్టివేస్తున్నట్లు, చేయి చేసుకున్నట్లు ఉన్న వీడియో అప్పట్లో ఇంటర్నెట్‌ను ఊపేసింది. అయితే, ఆ గొడవకు కారణం ఒక ఇరాన్ నటి అని తాజాగా వెలుగులోకి వచ్చిన కథనాలు అంతర్జాతీయ మీడియాలో కలకలం రేపుతున్నాయి.

పుస్తకంలో సంచలన నిజాలు

జర్నలిస్టు ఫ్లోరియన్ టార్డిఫ్ రాసిన ‘యాన్ పర్‌ఫెక్ట్ కపుల్’ అనే కొత్త పుస్తకంలో ఈ దంపతుల మధ్య ఉన్న విభేదాలకు సంబంధించిన ఆసక్తికర అంశాలను ప్రస్తావించారు. ఆ పుస్తకంలోని కథనాల ప్రకారం.. ఇరాన్ నటి గోల్షిఫ్తే ఫరాహానీతో మాక్రాన్ సన్నిహితంగా ఉండటమే ఈ గొడవకు అసలు మూలమని తెలుస్తోంది. ఆ నటికి మాక్రాన్ నువ్వు చాలా అందంగా ఉన్నావు అని సందేశం పంపారని, ఆ మెసేజ్‌లను బ్రిగిట్టే ఆయన ఫోన్‌లో చూశారని రచయిత పేర్కొన్నారు.

అది చెంపదెబ్బకు దారితీసిందా..?

వీరిద్దరి మధ్య నెలల తరబడి ప్లాటోనిక్ రిలేషన్‌షిప్ కొనసాగిందని నివేదికలు చెబుతున్నాయి. అయితే, ఈ మెసేజ్‌ల వ్యవహారం బ్రిగిట్టేకు ఆగ్రహం తెప్పించిందని, ఆ కోపంలోనే ఆమె అధ్యక్షుడి చెంప వాయించారని ఈ పుస్తకంలో రాశారు. విమానం తలుపులు తెరుచుకునే ముందు కేబిన్ లోపల జరిగిన ఈ ఉద్రిక్తత, బయటకు వచ్చేసరికి కెమెరాలకు చిక్కడంతో ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఈ సంచలన ఆరోపణలను ఎలిసీ ప్యాలెస్ తీవ్రంగా ఖండించింది. ఆమె ప్రతినిధులు ఈ వార్తలను కొట్టిపారేస్తూ.. బ్రిగిట్టే ఎప్పుడూ తన భర్త ఫోన్‌ను చెక్ చేయరని స్పష్టం చేశారు.

అది కేవలం భార్యాభర్తల మధ్య జరిగిన సరదా సన్నివేశమే తప్ప, గొడవ కాదని గతంలోనే ఆయన చెప్పుకొచ్చారు. ఇరాన్ నటి ఫరాహానీ కూడా ఈ సంబంధంపై వస్తున్న వార్తలను తోసిపుచ్చారు. నిజానిజాలు ఎలా ఉన్నా, ఒక దేశాధ్యక్షుడి వ్యక్తిగత జీవితం చుట్టూ ఇన్ని కథనాలు అల్లడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇరాన్ పాలకులపై తీవ్ర విమర్శలు చేసే నటి గోల్షిఫ్తే ఫరాహానీ పేరు ఈ వివాదంలోకి రావడంతో.. ఇది కేవలం వ్యక్తిగత గొడవలా లేక రాజకీయ కోణాలు ఏవైనా ఉన్నాయా అన్నది వేచి చూడాలి. ఏది ఏమైనా, ఫ్రెంచ్ అధ్యక్ష దంపతుల పర్ఫెక్ట్ ఇమేజ్‌కు ఈ చెంపదెబ్బ వ్యవహారం కొంత మచ్చ తెచ్చిందనే చెప్పాలి.

Tags:    

Similar News