Medchal: యాప్రాల్‌లో వివాహిత అనుమానాస్పద మృతి.. భర్తపై కేసు నమోదు!

Medchal: జవహర్‌నగర్ పీఎస్ పరిధి యాప్రాల్‌లో వివాహిత లలిత అనుమానాస్పద మృతి. భర్తపై కుటుంబ సభ్యుల అనుమానం, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

Update: 2026-08-02 12:57 GMT

Medchal: యాప్రాల్‌లో వివాహిత అనుమానాస్పద మృతి.. భర్తపై కేసు నమోదు!

మేడ్చల్ జిల్లా...

యాప్రాల్‌లో వివాహిత మృతి..

భర్తపై అనుమానంతో కేసు నమోదు.

కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వివాహిత అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందిన ఘటన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధి యాప్రాల్ చోటు చేసుకుంది. పోలీసులు మరియు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం నాగర్ కేశంపేట్ తండాకు చెందిన ఎ. లలిత (28)ను 2017లో బాలరాజుతో వివాహం చేశారు. వారికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. బాలరాజు భారత సైన్యంలో ఉద్యోగం చేస్తూ యాప్రాల్‌లో కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య తరచూ కుటుంబ కలహాలు జరుగుతున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. సుమారు మూడు నెలల క్రితం బాలరాజు లలితపై దాడి చేయడంతో ఆమె పుట్టింటికి వెళ్లిందని, అనంతరం కుటుంబ సభ్యులు తిరిగి అత్తవారింటికి పంపించగా, ఆ సమయంలో కూడా బాలరాజు తనను, తన భార్యను కొట్టాడని మృతురాలి సోదరుడు ఆరోపించాడు. శనివారం మధ్యాహ్నం సమయంలో లలిత నివసిస్తున్న ఇంటి రెండో అంతస్తులో నివసించే వ్యక్తి ఫోన్ చేసి, లలిత తన చేతిని హీటర్ ఉన్న నీటి బకెట్‌లో పెట్టుకుందని, ఆమెను ఆస్పత్రికి తరలిస్తున్నట్లు సమాచారం ఇచ్చినట్లు ఫిర్యాదుదారు తెలిపారు. కొద్దిసేపటికే ఆమె మృతి చెందినట్లు తెలిసిందని, మృతదేహాన్ని ఆర్మీ ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం అందిందన్నారు. హీటర్ ఉన్న నీటి బకెట్‌కు సంబంధించిన ఘటన కారణంగానే తన చెల్లెలు మృతి చెందిందని, ఆమె భర్త బాలరాజు మరణానికి కారణమనే బలమైన అనుమానం ఉందని ఫిర్యాదులో పేర్కొంటూ చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. మృతురాలి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.

Tags:    

Similar News