Pocharam: పక్కింటికి వెళ్లొచ్చేలోపే ఘోర చోరీ: బంగారం, నగదు మాయం!

Pocharam: పోచారం యంనంపేటలో ఘోర చోరీ! ఇంటికి తాళం వేసి పక్కింటికి వెళ్లొచ్చేలోపే 9 తులాల బంగారం, రూ.50 వేల నగదు అపహరణ. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Update: 2026-08-02 11:29 GMT

Pocharam: పక్కింటికి వెళ్లొచ్చేలోపే ఘోర చోరీ: బంగారం, నగదు మాయం!

పక్కింటికి వెళ్లొచ్చేలోపే చోరీ..

9 తులాల బంగారం, రూ.50 వేల నగదు మాయం

పోచారం: ఇంటికి తాళం వేసి కాసేపు పక్కింటికి వెళ్లి వచ్చేలోపే దొంగలు చేతివాటం చూపారు. తాళాలు పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించిన గుర్తుతెలియని వ్యక్తులు బీరువాలోని సుమారు 8 తులాల బంగారు ఆభరణాలు, రూ.50 వేల నగదును అపహరించారు. ఈ ఘటన మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధి యంనంపేటలో ఆదివారం పట్టపగలు జరిగింది. బాధితులు పోలగోని మధు (66), పోలగోని వినోద (55) తెలిపిన వివరాల ప్రకారం ఇంటికి తాళం వేసి కొద్దిసేపు వెనుకవైపు ఉన్న మరో ఇంటికి వెళ్లి తిరిగి వచ్చేసరికి గేటు, ప్రధాన తలుపుల తాళాలు పగులగొట్టి ఉన్నాయి. లోపలికి వెళ్లి చూడగా బీరువా తాళం కూడా విరగొట్టి ఉండగా, అందులో భద్రపరిచిన 9 తులాల బంగారు ఆభరణాలు, రూ.50 వేల నగదు కనిపించలేదు. దీంతో వెంటనే పోచారం పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీం సహాయంతో ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసి పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తూ దర్యాప్తు చేపట్టారు.

Tags:    

Similar News