Kukatpally: విషాదం ప్రైవేట్ హాస్టల్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య!

Kukatpally: కేపీహెచ్‌బీ పరిధిలోని ప్రైవేట్ హాస్టల్‌లో ప్రేమ వ్యవహారంతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని యామిని ఆత్మహత్య చేసుకుంది; పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Update: 2026-08-21 06:27 GMT

Kukatpally: విషాదం ప్రైవేట్ హాస్టల్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య!

Kukatpally: కేపీహెచ్‌బీ పరిధిలోని ఓ ప్రైవేట్‌ హాస్టల్‌లో యామిని (24) అనే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కేపీహెచ్‌బీ రోడ్‌ నంబర్‌-1లోని ఎంఐజీ-65లో ఉన్న ప్రైవేట్‌ హాస్టల్‌లో యామిని నివాసం ఉంటోంది.

ప్రేమ వ్యవహారంలో మనస్తాపానికి గురై ఆమె ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు ప్రాథమికంగా సమాచారం. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి, ఆత్మహత్యకు దారితీసిన కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News