Manikonda: మణికొండ మహాత్మా గాంధీ పార్కు పునరుద్ధరణ పనులకు శ్రీకారం!
Manikonda: మణికొండ అల్కాపూర్ టౌన్‌షిప్‌లోని మహాత్మా గాంధీ పార్కు పునరుద్ధరణ పనులను రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ ప్రారంభించారు.
Manikonda: మణికొండ మహాత్మా గాంధీ పార్కు పునరుద్ధరణ పనులకు శ్రీకారం!
మణికొండ: గండిపేట మండలం నార్సింగి సర్కిల్ పరిధిలోని మణికొండ అల్కాపూర్ టౌన్‌షిప్‌లో ఉన్న మహాత్మా గాంధీ పార్కు పునరుద్ధరణ పనులను రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి. ప్రకాశ్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ స్థానిక ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడంతో పాటు పిల్లలు, మహిళలు, వృద్ధులకు ఉపయోగపడేలా పార్కును మరింత అభివృద్ధి చేసి, అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
పార్కు పునరుద్ధరణతో స్థానికులకు మెరుగైన వాకింగ్, వ్యాయామం, విశ్రాంతి సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లేశ్ ముదిరాజ్, నార్సింగి మార్కెట్ చైర్మన్ వేణుగౌడ్, నార్సింగి మార్కెట్ డైరెక్టర్ లక్ష్మీశ్రీ, బాలారెడ్డి, జితేంద్ర, మాజీ కౌన్సిలర్ రామకృష్ణ రెడ్డి, బషీర్, దాసు, ప్రభావతి, పద్మారావు, శ్రవణ్, నరేష్ పలువురు మణికొండ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు, అధికారులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.