Amangal: ఆమనగల్ మున్సిపాలిటీ బీజేపీ ఉపాధ్యక్షుడిగా జంతుక శివ ఎన్నిక

Amangal: రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మున్సిపాలిటీ బీజేపీ ఉపాధ్యక్షుడిగా జంతుక శివ (నాటు) ఎన్నిక. హర్షం వ్యక్తం చేసిన పార్టీ నాయకులు, కార్యకర్తలు.

Update: 2026-08-04 14:27 GMT

Amangal: ఆమనగల్ మున్సిపాలిటీ బీజేపీ ఉపాధ్యక్షుడిగా జంతుక శివ ఎన్నిక

ఆమనగల్: రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మున్సిపాలిటీ ఆమనగల్ మున్సిపాలిటీ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఉపాధ్యక్షుడిగా జంతుక శివ (నాటు) ఎన్నిక కావడం పట్ల పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా జంతుక శివ (నాటు) మాట్లాడుతూ, తనపై విశ్వాసం ఉంచి పార్టీ ఉపాధ్యక్ష బాధ్యతలను అప్పగించిన జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఈ నియామకానికి సహకరించిన పార్టీ ముఖ్య నాయకులకు, సీనియర్ నాయకులకు, కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

పార్టీ తనకు అప్పగించిన బాధ్యతలను నిబద్ధతతో నిర్వర్తిస్తూ, పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో నిరంతరం కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు తెలుపుతూ శాలువాతో సత్కరించారు. శుభాకాంక్షలు తెలియజేశారు

Tags:    

Similar News