Hyderabad: యువ ఇంజనీర్లను కించపరచడం సరికాదు ఎంపీ ఆర్. కృష్ణయ్య
Hyderabad: యువ ఇంజనీర్లపై సీఎం రేవంత్ వ్యాఖ్యలను ఖండించిన ఎంపీ ఆర్ కృష్ణయ్య. ఆగస్టు 15లోగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని విజ్ఞప్తి.
Hyderabad: యువ ఇంజనీర్లను కించపరచడం సరికాదు ఎంపీ ఆర్. కృష్ణయ్య
హైదరాబాద్: యువ ఇంజనీయర్లను ఉద్దేశిస్తూ క్రిమినల్ వెస్ట్ అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య ఖండించారు. వారు కొత్త కొత్త ఇన్నోవేషన్ లతో ప్రపంచ స్థాయిలో ఎన్నో సంస్కరణలు తీసుకొస్తున్నారని , వారిని కించపరచడం సరికాదన్నారు.
హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో బిసి విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆర్ కృష్ణయ్య ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. ముఖ్యమంత్రి భేషజాలకు పోకుండా , ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేసి , పాత పద్ధతిలోనే పథకాన్ని కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. నిరుద్యోగ యువత మద్దతుతోనే అధికారంలోకి వచ్చిన విషయాన్ని ముఖ్యమంత్రి మరిచిపోవద్దని సూచించారు.
ముఖ్యమంత్రి తలుచుకుంటే బకాయిలు 10 రోజుల్లో విడుదల అవుతాయని... అలా చేస్తే మరో ఐదేళ్లు ఆయనే ముఖ్యమంత్రిగా కొనసాగుతారన్నారు. బకాయిల విడుదల కోసం విద్యార్దులు శాంతియుతంగా ఉద్యమాన్ని కొనసాగించాలని... ఎమ్మెల్యేలు , జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలను అందజేయాలని కోరారు. ఆగస్టు 15 వరకు ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోతే , భవిష్యత్ ఉద్యమ కార్యచరణను ప్రకటిస్తామని ఆర్ కృష్ణయ్య స్పష్టం చేశారు.