Hayathnagar: ప్రభుత్వ డిగ్రీ కళాశాల హయత్‌నగర్‌లో ఎన్‌సీసీ నమోదు ప్రక్రియ!
Hayathnagar: హయత్‌నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి ఎన్‌సీసీ నమోదు ప్రక్రియ నిర్వహించారు. 1(T) నేవల్ యూనిట్ కెప్టెన్ కే.ఆర్. రావు హాజరయ్యారు.
Hayathnagar: ప్రభుత్వ డిగ్రీ కళాశాల హయత్‌నగర్‌లో ఎన్‌సీసీ నమోదు ప్రక్రియ!
Hayathnagar: ప్రభుత్వ డిగ్రీ కళాశాల హయత్‌నగర్‌లో 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి మొదటి సంవత్సరం విద్యార్థుల ఎన్‌సీసీ (NCC) నమోదు ప్రక్రియను బుధవారం నిర్వహించారు.
ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు 1 (T) నేవల్ యూనిట్ NCC, సికింద్రాబాద్ గ్రూప్ కమాండింగ్ ఆఫీసర్ కెప్టెన్ (ఇండియన్ నేవీ) కె.ఆర్. రావు కళాశాలను సందర్శించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సురేష్ బాబు మాట్లాడుతూ మొదటి సంవత్సరం విద్యార్థుల కోసం ఎన్‌సీసీ నమోదు ప్రక్రియను నిర్వహించినట్లు తెలిపారు.
కెప్టెన్ కె.ఆర్. రావుకు కళాశాల ఎన్‌సీసీ క్యాడెట్లు గౌరవ వందనం (గార్డ్ ఆఫ్ ఆనర్) సమర్పించారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి కెప్టెన్ కె.ఆర్. రావు మాట్లాడుతూ ఎన్‌సీసీలో పాల్గొనడం ద్వారా విద్యార్థుల్లో క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, దేశభక్తి, సేవాభావం, బాధ్యతాయుత పౌరసత్వం వంటి విలువలు పెంపొందుతాయని తెలిపారు.
ప్రభుత్వ డిగ్రీ కళాశాల హయత్‌నగర్ అసోసియేట్ ఎన్‌సీసీ అధికారి సబ్ లెఫ్టినెంట్ డాక్టర్ ఎస్. ధన్‌రాజ్ మార్గదర్శకత్వంలో ఎన్‌సీసీ నమోదు ప్రక్రియ నిర్వహించారు.