Nacharam: నాచారంలో 'మీ సురక్ష–సహచరి' సభ్యుల అవగాహన సమావేశం

Nacharam: నాచారంలో మహిళల భద్రత, సైబర్ నేరాల నివారణపై 'మీ సురక్ష–సహచరి' సభ్యుల సమావేశం. హాజరైన డీసీపీ శ్యామ్‌సుందర్, ఎస్‌హెచ్‌వో ధనుంజయ్.

Update: 2026-08-07 09:58 GMT

Nacharam: నాచారంలో 'మీ సురక్ష–సహచరి' సభ్యుల అవగాహన సమావేశం

నాచారం: మహిళల భద్రత, సైబర్ నేరాల నివారణ, కమ్యూనిటీ పోలీసింగ్‌ను బలోపేతం చేసే లక్ష్యంతో నాచారం పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓల్డ్ మల్లాపూర్ అంబేద్కర్‌నగర్‌లో శుక్రవారం "మీ సురక్ష–సహచరి" సభ్యుల సమావేశం నిర్వహించారు.

కార్యక్రమానికి డీసీపీ శ్యామ్‌సుందర్, నాచారం ఎస్‌హెచ్‌వో ధనుంజయ్, ఎస్‌ఐ మైబెల్లి, షీ టీమ్స్ ఇన్‌స్పెక్టర్ అంజయ్య, సీడీఈడబ్ల్యూ సుధా, డబ్ల్యూఎస్‌ఐ రాణి, డబ్ల్యూఏఎస్‌ఐ రజని, మహిళా పోలీసు సిబ్బంది, 50 మంది సహచరి సభ్యులు పాల్గొన్నారు.

సమావేశంలో మహిళల భద్రత, సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలు, మాదకద్రవ్యాల నిర్మూలన, రోడ్డు భద్రత, ప్రజలు–పోలీసుల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేసే అంశాలపై అధికారులు అవగాహన కల్పించారు. ప్రతి సహచరి సభ్యురాలు పోలీసు శాఖకు కమ్యూనిటీ సేఫ్టీ అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ ప్రజలు, పోలీసుల మధ్య వారధిగా నిలవాలని సూచించారు.

అనుమానాస్పద వ్యక్తులు, కార్యకలాపాలపై వెంటనే పోలీసులకు సమాచారం అందించడం, గృహహింస, బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ, మానవ అక్రమ రవాణా వంటి ఘటనలను గుర్తించి సమాచారమివ్వడం, బాధితులకు అవసరమైన సహాయాన్ని అందించడంలో సహచరి సభ్యులు చురుకైన పాత్ర పోషించాలని అధికారులు కోరారు.

అలాగే ఫేక్ న్యూస్‌, సోషల్ మీడియా వదంతులపై ప్రజల్లో చైతన్యం కల్పించడం, అత్యవసర హెల్ప్‌లైన్‌ల వినియోగం, సీసీటీవీ కెమెరాల ఏర్పాటు, యువతను మాదకద్రవ్యాలకు దూరంగా ఉంచే అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని సూచించారు.

పోలీసు–ప్రజల మధ్య పరస్పర విశ్వాసాన్ని పెంపొందించి, సురక్షితమైన, నేరరహిత సమాజ నిర్మాణానికి సహచరి సభ్యులు పోలీసులతో కలిసి పనిచేయాలని అధికారులు పిలుపునిచ్చారు.

Tags:    

Similar News