Malkajgiri: ప్రజల్లోకి పార్టీ సిద్ధాంతాలు: గిరివర్ధన్
Malkajgiri: మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా బీజేపీ అధ్యక్షుడు గిరి వర్ధన్ రెడ్డిని నేతలు కలిశారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు.
Malkajgiri: ప్రజల్లోకి పార్టీ సిద్ధాంతాలు: గిరివర్ధన్
పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి మరింత సమర్థవంతంగా తీసుకెళ్లాలి..గిరి వర్ధన్ రెడ్డి
మేడ్చల్–మల్కాజ్గిరి: అర్బన్ జిల్లా భారతీయ జనతా పార్టీ నూతన జిల్లా అధ్యక్షులుగా నియమితులైన గిరి వర్ధన్ రెడ్డి ని వారి నివాసంలో డాక్టర్ ఎస్. రావు నగర్ డివిజన్‌కు చెందిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలియజేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, గిరి వర్ధన్ రెడ్డి నాయకత్వంలో జిల్లా పార్టీ సంస్థాగతంగా మరింత బలోపేతం అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి మరింత సమర్థవంతంగా తీసుకెళ్లడంతో పాటు, కార్యకర్తలకు ప్రాధాన్యతనిస్తూ పార్టీని విజయవంతంగా ముందుకు నడిపించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎస్. రావు నగర్ డివిజన్ అధ్యక్షురాలు తుమ్మల సంధ్యా నర్సిరెడ్డి , సీనియర్ నాయకులు అంబటి వెంకటాచలం, జీవీఎన్ రావు, ఏనుగు రాజిరెడ్డి, సందీప్ చారి, సోమేశ్ నాయుడు, దేవ గౌడ్, నర్సిరెడ్డి, మురళి, సంతోష్ బీజేవైఎం నాయకులు నవీన్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.