Hyderabad: కొల్లూరులో ‘మహారాజా కోస్మోపోలిస్’ ఆధునిక గేటెడ్ కమ్యూనిటీ

హైదరాబాద్: హైదరాబాద్ పశ్చిమ ప్రాంతంలోని వేగంగా అభివృద్ధి చెందుతున్న కొల్లూరులో మహారాజా స్పేసెస్ సంస్థ ప్రతిష్ఠాత్మకంగా ‘మహారాజా కోస్మోపోలిస్’ గేటెడ్ కమ్యూనిటీని అభివృద్ధి చేస్తోంది. ఐదు టవర్లతో నిర్మితమవుతున్న ఈ ప్రాజెక్టులో 3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆధునిక లైఫ్‌స్టైల్ సదుపాయాలు, 75 శాతం ఓపెన్ స్పేస్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.

నియోపోలిస్‌కు కేవలం 8 నిమిషాల దూరంలో, ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలో ఉన్న ఈ ప్రాజెక్టులో చదరపు అడుగుకు రూ.6,399 ప్రారంభ ధరగా నిర్ణయించారు.

ఈ సందర్భంగా తెలంగాణ ఐఏఎస్ అధికారి జయేశ్ రంజన్ మాట్లాడుతూ, కొల్లూరు–కోకాపేట ప్రాంతం భవిష్యత్తులో హైదరాబాద్‌లో కీలక బిజినెస్ హబ్‌గా ఎదిగే అవకాశాలున్నాయని పేర్కొన్నారు.

మహారాజా స్పేసెస్ డైరెక్టర్ వివేక్ నాయుడు మాట్లాడుతూ, ఆధునిక సౌకర్యాలు, సామాజిక అనుబంధాలు, ప్రశాంతమైన వాతావరణాన్ని కలగలిపి కోస్మోపోలిస్‌ను రూపొందిస్తున్నామని తెలిపారు.

Tags: