Hyderabad: హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం మాదన్నపేట్ మార్కెట్‌లో మంటలు!
Hyderabad: హైదరాబాద్ మాదన్నపేట్ మార్కెట్‌లో భారీ అగ్నిప్రమాదం. మార్కెట్‌లో మంటలు చెలరేగడం మూడోసారి కావడంతో భద్రతా చర్యలు లేవంటూ వ్యాపారస్తులు, స్థానికుల నిరసన.
Hyderabad: హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం మాదన్నపేట్ మార్కెట్‌లో మంటలు!
Hyderabad: మాదన్నపేట్ మార్కెట్‌లో భారీ అగ్నిప్రమాదం మాదన్నపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మార్కెట్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో వ్యాపారస్తులు, స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు.
మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే... మాదన్నపేట్ మార్కెట్‌లో అగ్నిప్రమాదం జరగడం ఇది మూడోసారి అని స్థానికులు చెబుతున్నారు. గతంలో రెండుసార్లు అగ్నిప్రమాదాలు జరిగినా మార్కెట్ యాజమాన్యం భద్రతా చర్యలు చేపట్టడం లేదంటూ వ్యాపారస్తులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
లక్షల్లో కిరాయీలు వసూలు చేస్తున్న యాజమాన్యం... కనీస అగ్నిమాపక భద్రతా చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. మార్కెట్‌లో ఫైర్ సేఫ్టీ నిబంధనలు అమలవుతున్నాయా? అగ్నిమాపక పరికరాలు, అత్యవసర మార్గాలు అందుబాటులో ఉన్నాయా?
అధికారులు ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదంటూ నిలదీస్తున్నారు. పెద్ద ప్రమాదం జరిగి ప్రాణనష్టం సంభవిస్తే బాధ్యత ఎవరిది? ప్రమాదం జరిగిన ప్రతిసారి హడావుడి చేయడం కాకుండా... ముందస్తు భద్రతా చర్యలు చేపట్టాలని స్థానికులు, వ్యాపారస్తులు డిమాండ్ చేస్తున్నారు.