Hyderabad: కేపీహెచ్‌బీ పరిధిలోని లేడీస్ హాస్టల్‌లో మహిళ ఆత్మహత్య

Hyderabad: కూకట్‌పల్లి కేపీహెచ్‌బీ పీఎస్‌ పరిధిలోని సర్దార్ పటేల్ నగర్ లేడీస్ హాస్టల్‌లో తిరుపతి సుధ ఆత్మహత్య. కుటుంబ సమస్యలే కారణమని పోలీసుల వెల్లడి.

Update: 2026-08-12 12:50 GMT

Hyderabad: కేపీహెచ్‌బీ పరిధిలోని లేడీస్ హాస్టల్‌లో మహిళ ఆత్మహత్య

హైదరాబాద్: కూకట్ పల్లి, కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో సర్దార్ పటేల్ నగర్‌లోనీ ఓ లేడీస్ హాస్టల్‌లోనీ తిరుపతి (51) సుధ ఆత్మహత్యకు పాల్పడింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హాస్టల్‌లో హౌస్‌కీపింగ్‌గా పనిచేస్తున్న సుధ అదే హాస్టల్‌లో నివసిస్తోంది. బుధవారం ఉదయం గీజర్ తాళం కోసం హాస్టల్ సిబ్బంది సంజన ఆమె గది వద్దకు వెళ్లగా తలుపు మూసి ఉండటంతో లోపలికి వెళ్లి చూడగా ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుని కనిపించింది.

సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకున్నారు. అప్పటికే సుధ మృతి చెందినట్లు వైద్య సిబ్బంది నిర్ధారించారు. కుటుంబ సమస్యలతో కొంతకాలంగా సుధ తీవ్ర మనోవేదనకు గురవుతున్నట్లు ఆమె సోదరి పోలీసులకు తెలిపింది. మృతిపై తమకు ఎలాంటి అనుమానం లేదని పేర్కొంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News