LB Nagar: కానిస్టేబుల్ సాయికుమార్ కుటుంబానికి ప్రభుత్వం అండ: ఎమ్మెల్యే

LB Nagar: ఎల్బీనగర్ ఏసీపీ కార్యాలయం కానిస్టేబుల్ సాయికుమార్ మృతి పట్ల ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మాల్రెడ్డి రంగారెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Update: 2026-08-12 12:18 GMT

LB Nagar: కానిస్టేబుల్ సాయికుమార్ కుటుంబానికి ప్రభుత్వం అండ: ఎమ్మెల్యే

ఎల్బీనగర్: ఎల్బీనగర్ ఏసీపీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తూ కానిస్టేబుల్ సాయికుమార్ మృతి చెందిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోయిన సాయికుమార్ కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మాల్రెడ్డి రంగారెడ్డి తెలిపారు.

బాధిత కుటుంబానికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి, ఉన్నతాధికారులు, పోలీస్ కమిషనర్‌తో మాట్లాడినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. ప్రభుత్వం తరఫున రూ.22 లక్షల ఆర్థిక సాయం అందించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

కేవలం ఆర్థిక సాయంతో కుటుంబానికి పూర్తి భరోసా కలగదని భావించి, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించే అంశంపై కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని చెప్పారు. ఉన్నతస్థాయిలో చర్చించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.

సుసైడ్ నోట్‌పై శాఖాపరమైన విచారణ కానిస్టేబుల్ సాయికుమార్ రాసిన సుసైడ్ నోట్‌పై సమగ్రంగా డిపార్ట్‌మెంటల్ ఎంక్వైరీ నిర్వహించాలని పోలీస్ కమిషనర్, మల్కాజిగిరి డీసీపీని కోరినట్లు ఎమ్మెల్యే తెలిపారు. నోట్‌లో పేర్కొన్న అంశాలపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి, బాధ్యులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసినట్లు చెప్పారు.

సాయికుమార్ తన నోట్‌లో తనకు ఇబ్బందిగా ఉందని, తనను ప్రస్తుత విధుల నుంచి షిఫ్ట్ చేసి వేరే చోటుకు పంపించాలని కోరినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. సుసైడ్ నోట్‌లో ఉన్న అంశాలనే తాను అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.

ఈ ఘటనపై ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి, బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చినట్లు మాల్రెడ్డి రంగారెడ్డి తెలిపారు. సాయికుమార్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు ఈ అంశాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

Tags:    

Similar News