Hyderabad: నాగోల్‌లో యువతి అదృశ్యం – పోలీసుల దర్యాప్తు ముమ్మరం

Hyderabad: నాగోల్‌లో విధులకు వెళ్లిన 21 ఏళ్ల యువతి సాయిప్రియ అదృశ్యం. కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టిన నాగోల్ పోలీసులు.

Update: 2026-08-15 11:29 GMT

Hyderabad: నాగోల్‌లో యువతి అదృశ్యం – పోలీసుల దర్యాప్తు ముమ్మరం

హైదరాబాద్: నాగోల్... విధులకు వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లిన 21 ఏళ్ల యువతి అదృశ్యమైన ఘటన నాగోల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో కలకలం రేపింది. న్యూ నాగోల్‌లోని రత్నదీప్‌లో పనిచేస్తున్న సాయి ప్రియ ఈ నెల 13న ఉదయం 7 గంటలకు ఇంటి నుంచి విధులకు బయలుదేరింది. అయితే రాత్రి అయినా ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు.

బంధువులు, స్నేహితులు, పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా గాలించినా సాయి ప్రియ ఆచూకీ లభించలేదు. యువతి అదృశ్యం వెనుక ప్రభు అనే వ్యక్తి ప్రమేయం ఉండొచ్చని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. దీంతో యువతి మేనమామ కనుగంటి సంపత్ నాగోల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదు ఆధారంగా పోలీసులు క్రైం నంబర్ 510/2026 కింద మహిళ అదృశ్యం కేసు నమోదు చేశారు. యువతి ఆచూకీ కోసం దర్యాప్తు ముమ్మరం చేశారు. కేసును ఎస్‌ఐ పి. శివ నాగ ప్రసాద్ దర్యాప్తు చేస్తున్నారు.

అదృశ్యమైన యువతి ఆనవాళ్లు: సుమారు 4.5 అడుగుల ఎత్తు, గుండ్రటి ముఖం, తెలుగు మాట్లాడుతుంది. అదృశ్యమైన సమయంలో నీలం రంగు షర్ట్‌, ప్యాంట్‌ ధరించి ఉంది. యువతి ఆచూకీ కోసం పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News