Hyderabad: ఎమ్మెల్సీ రహ్మత్ బేగ్‌ను తక్షణమే అరెస్ట్ చేయాలి బీజేవైఎం డిమాండ్
Hyderabad: మైనర్ బాలికపై అత్యాచార ఆరోపణలున్న ఎంఐఎం ఎమ్మెల్సీ మిర్జా రహ్మత్ బేగ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ కుండే డిమాండ్ చేశారు.
Hyderabad: ఎమ్మెల్సీ రహ్మత్ బేగ్‌ను తక్షణమే అరెస్ట్ చేయాలి బీజేవైఎం డిమాండ్
హైదరాబాద్: మైనర్ బాలికపై అత్యాచారం చేశాడని ఆరోపణలను ఎదుర్కొంటున్న ఎంఐఎం నాయకుడు , ఎమ్మెల్సీ మిర్జా రహ్మత్ బేగ్ ను తక్షణమే అరెస్ట్ చేయాలని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ కుండే డిమాండ్ చేశారు.
అత్యాచార ఘటనను తీవ్రంగా ఖండిస్తూ... మజ్లీస్ ఎమ్మెల్సీ రహ్మత్ బేగ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ... ఎంజీ మార్కెట్ చౌరస్తాలో బీజేవైఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఎమ్మెల్సీ దిష్టిబొమ్మ దహనం చేసిన బీజేవైఎం నాయకులు, , ఎంఐఎం పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఎమ్మెల్సీ తప్పు చేశారని వారి పార్టీ నాయకులే ఒప్పుకొని , పార్టీ నుండి బహిష్కరించారని... కానీ పోలీసులు ఇప్పటి వరకు అతన్ని అరెస్ట్ చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తుందన్నారు.
ఎమ్మెల్సీ ను అదుపులోకి తీసుకొని విచారిస్తే , అతని మరిన్ని బాగోతాలు బయటపడే అవకాశం ఉందన్నారు. తక్షణమే రెహ్మత్ బేగ్ ను అరెస్ట్ చేసి , చట్టపరంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని గణేష్ కుండే డిమాండ్ చేశారు.