Banjara Hills: బంజారాహిల్స్‌లో భారీ జ్యువెలరీ చోరీ గుట్టురట్టు
Banjara Hills: బంజారాహిల్స్‌లోని ప్రైవేట్ జ్యువెలరీ కంపెనీలో కిలోకు పైగా బంగారం చోరీ చేసిన సేల్స్ ఎగ్జిక్యూటివ్ అరెస్ట్ చేసిన వెస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్.
Banjara Hills: బంజారాహిల్స్‌లో భారీ జ్యువెలరీ చోరీ గుట్టురట్టు
Banjara Hills: హైదరాబాద్ నగరంలోని ప్రముఖ బంజారాహిల్స్ పరిధిలో జరిగిన భారీ బంగారు ఆభరణాల చోరీ కేసును వెస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ మరియు బంజారాహిల్స్ పోలీసులు సంయుక్తంగా ఛేదించారు. ప్రైవేట్ జ్యువెలరీ సంస్థలోనే పనిచేస్తూ కిలోకు పైగా బంగారాన్ని దొంగిలించిన సేల్స్ ఎగ్జిక్యూటివ్‌తో పాటు అతనికి సహకరించిన సోదరుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
నిందితుల వద్ద నుంచి 1 కిలో 28.59 గ్రాముల బరువుగల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
జ్యువెలరీ సంస్థలోనే పనిచేస్తూ చోరీ ప్లాన్!
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడైన సోంకాంబ్లే హరీష్ బంజారాహిల్స్‌లోని ఒక ప్రముఖ ప్రైవేట్ జ్యువెలరీ కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నాడు. సంస్థ లాకర్‌లో ఉన్న భారీ బంగారు ఆభరణాలపై కన్నువేసిన హరీష్, ఎలాగైనా వాటిని కాజేయాలని పక్కా ప్లాన్ వేశాడు.
దొంగిలించిన బంగారంతో పరారైన హరీష్, ఆ సొత్తును తన సోదరుడైన సోంకాంబ్లే ఆకాష్ వద్ద దాచిపెట్టాడు. జ్యువెలరీ యాజమాన్యం ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన టాస్క్‌ఫోర్స్ మరియు బంజారాహిల్స్ పోలీసులు, సాంకేతిక ఆధారాల సహాయంతో దర్యాప్తు చేపట్టి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
విచారణలో నిందితులు నేరాన్ని అంగీకరించగా, వారి వద్ద నుంచి 7 బంగారు హారాలు, 7 జతల బంగారు చెవిపోగులను స్వాధీనం చేసుకుని ఇద్దరినీ రిమాండ్‌కు తరలించారు. చాకచక్యంగా వ్యవహరించి కేసును ఛేదించిన టాస్క్‌ఫోర్స్ సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు.