Uppal: హెచ్‌సీఏలోకి అంబటి రాయుడు ఎంట్రీ!
Uppal: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది.
Uppal: హెచ్‌సీఏలోకి అంబటి రాయుడు ఎంట్రీ!
Uppal: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో కీలక మార్పులకు శ్రీకారం చుట్టారు. ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో నిర్వహించిన మీడియా సమావేశంలో హెచ్‌సీఏ అధ్యక్షుడు అమర్నాథ్, కార్యదర్శి జీవన్ రెడ్డి కీలక నిర్ణయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా భారత మాజీ అంతర్జాతీయ క్రికెటర్ అంబటి రాయుడును క్రికెట్ ఆపరేషన్స్ హెడ్‌గా నియమించినట్లు ప్రకటించారు. క్రికెట్ వ్యవస్థలో పారదర్శకతను పెంపొందించడమే లక్ష్యంగా ఈ నియామకం చేపట్టినట్లు తెలిపారు.
అలాగే, అవినీతి నిరోధక చర్యలకు మరింత బలం చేకూర్చేందుకు హెచ్.సీఏ ప్రత్యేక యాంటీ-కరప్షన్ యూనిట్‌ను ఏర్పాటు చేస్తోంది. ఈ యూనిట్ కు చైర్మన్‌గా గౌరవనీయులైన Vijender Pingale (ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జ్) బాధ్యతలు చేపట్టనున్నారు. క్రికెట్ కు సంబంధించిన ఫిర్యాదులను వేగంగా పరిష్కరించేందుకు ప్రత్యేక గ్రీవెన్స్ రెడ్రెసల్ మెకానిజాన్ని కూడా ప్రారంభిస్తున్నట్లు హెచ్‌సీఏ వెల్లడించింది. ఇదిలా ఉండగా, హెచ్.సీఏ లీగ్ సీజన్ 2026–27ను మే 12 నుంచి ప్రారంభించనున్నారు.
మొదటగా A & B డివిజన్ టీ20 మ్యాచ్‌లను నిర్వహించనున్నారు. హెచ్.సీఏ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అకాడమీని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి, ఆధునిక శిక్షణ సౌకర్యాలు కల్పించేందుకు సంఘం సంకల్పించింది. గ్రామీణ ప్రాంతాల్లో క్రికెట్ అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ, జిల్లా స్థాయి ఆటగాళ్లకు మరిన్ని అవకాశాలు కల్పించనున్నట్లు స్పష్టం చేసింది. మొత్తంగా, ఈ నిర్ణయాలతో హెచ్.సీఏలో పారదర్శకత, ప్రొఫెషనలిజం పెరగనుందని భావిస్తున్నారు.