Medchal: అల్వాల్‌ బాలాజీ నగర్‌లో వైఎస్సార్ వర్ధంతి!

Medchal: అల్వాల్ బాలాజీ నగర్‌లో వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి వేడుకలు. వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన DCC అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్.

Update: 2026-09-02 08:12 GMT

Medchal: అల్వాల్‌ బాలాజీ నగర్‌లో వైఎస్సార్ వర్ధంతి!

Medchal: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా చంద్రపురి కాలనీ డివిజన్, జవహర్ నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వైయస్సార్ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ హాజరై బాలాజీ నగర్‌లోని డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా తోటకూర వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి రైతులు, పేదలు, విద్యార్థులు, బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి అనేక చారిత్రాత్మక పథకాలను అమలు చేశారని కొనియాడారు.

దేశంలోనే ఆదర్శంగా నిలిచే విధంగా రైతులకు ఉచిత విద్యుత్, అత్యవసర వైద్య సేవల కోసం 108, విద్యార్థుల ఉన్నత విద్యకు ఫీజు రీయింబర్స్‌మెంట్, పేదలకు ఇందిరమ్మ ఇళ్లు వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని అన్నారు.

డాక్టర్ వైయస్సార్ ఆశయాలను కొనసాగిస్తూ పేదలు, రైతులు, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం కృషి చేస్తుందని ఆయన పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో చంద్రపురి కాలనీ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లెపూల శ్రీకాంత్ యాదవ్, జవహర్ నగర్ డివిజన్ అధ్యక్షులు శాంతి కోటేష్ గౌడ్, మాజీ సర్పంచ్ కారింగుల శంకర్ గౌడ్, మాజీ డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి కల్లేపల్లి సదానంద్, రాష్ట్ర మహిళా కార్యదర్శి అనంతలక్ష్మి, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు మాట్లా వినయ్ కుమార్తో పాటు మాజీ ప్రజాప్రతినిధులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Tags:    

Similar News