Vatticherukuru: అక్వాన్ తుపాను నేపథ్యంలో వట్టిచెరుకూరులో అధికారుల అప్రమత్తత!
Vatticherukuru: రానున్న అక్వాన్ తుపాను ప్రభావం దృష్ట్యా వట్టిచెరుకూరు మండలం జల్లవాగు, కాలువలు, వాగు కట్టలను ప్రత్యేక అధికారి, డ్వామా పీడీ శంకర్, తహసీల్దార్ కె. రాజీవ్ కుమార్ పరిశీలించారు.
Vatticherukuru: అక్వాన్ తుపాను నేపథ్యంలో వట్టిచెరుకూరులో అధికారుల అప్రమత్తత!
వట్టిచెరుకూరు: రానున్న అక్వాన్ తుఫాను ప్రభావం దృష్ట్యా ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యలకు శ్రీకారం చుట్టింది. తుఫాను కారణంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో నీటి ప్రవాహానికి ఆటంకాలు ఏర్పడకుండా వాగులు, వంకలు, కాలువలు, కట్టలను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు.
ఈ నేపథ్యంలో వట్టిచెరుకూరు గ్రామ పరిధిలోని జల్లవాగు, జల్లవాగు ప్రవహించే కాలువలు, వాగు కట్టలను ప్రత్యేక అధికారులు పరిశీలించారు. నీటి ప్రవాహానికి ఎలాంటి ఆటంకాలు ఉన్నా, కట్టలకు మరమ్మతులు అవసరమైనా వెంటనే గుర్తించి సంబంధిత శాఖల సమన్వయంతో సమస్యలను పరిష్కరించాలని అధికారులకు సూచించారు.
ఈ తనిఖీల్లో ప్రత్యేక అధికారి, డ్వామా పీడీ శంకర్, తహసీల్దార్ కె. రాజీవ్ కుమార్, ఇరిగేషన్ ఏఈ స్వర్ణలత, ఆర్ ఐ మాణిక్యరావు, వీఆర్వో జే. వెంకటేశ్వరరావు తదితర అధికారులు పాల్గొన్నారు.