Guntur: సాధారణ గృహిణి నుంచి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ స్థాయికి!
Guntur: గుంటూరు జిల్లా పరిషత్తు చైర్పర్సన్ పీఠం దారా అరుణకు దక్కింది. ప్రత్తిపాడు నియోజకవర్గం వట్టిచెరుకూరు జడ్పీటీసీగా గెలిచిన ఆమె పేరును టీడీపీ అధిష్ఠానం ఖరారు చేసింది.
Guntur: సాధారణ గృహిణి నుంచి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ స్థాయికి!
గుంటూరు: ప్రత్తి పాడు నియోజకవర్గంలోని వట్టిచెరు కూరు జడ్పీటీసీ" స్థానం నుంచి గెలుపొందిన ఆమె పేరును ఖరారు చేస్తూ గురువారం రాత్రి తెదేపా అధిష్ఠానం ప్రకటించింది. శుక్రవారం మధ్యాహ్నం జిల్లా పరిషత్తు చైర్ప ర్సన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరగ నుంది. కూటమి ఒప్పందంలో భాగంగా జడ్పీ చైర్పర్సన్ పదవిని తెదేపాకు కేటాయించారు. ఇది ఎస్సీ మహిళకు రిజర్వు కావడంతో వట్టి చెరుకూరు, పెదనందిపాడు జడ్పీ టీసీ సభ్యులు పోటీ పడ్డారు.
చివరకు అరుణకు అవకాశం దక్కింది. నేడు ZPTC గా ప్రమాణ స్వీకారం వట్టిచెరుకూరు నుంచి జడ్పీటీసీగా విజయం పేరు : దారా అరుణ విద్యార్హత 9వ తరగతి వయసు ౩౮ భర్త: దారావెంకట్రావు, మిర్చి వ్యాపారి, వట్టిచెరుకూరు మండలం తెదేపా ప్రధాన కార్యదర్శి. సంతానం : కుమారుడు, కుమార్తె
గృహిణి నుంచి జడ్పీ పీఠానికి....
దారా అరుణ సాధారణ గృహిణి. భర్త వెంకట్రావు 20 సంవత్సరాలుగా తెదేపాలో క్రియాశీలకంగా పని చేసి పార్టీ అభివృద్ధికి కృషి . జడ్పీ చైర్పర్సన్ పదవి ఎస్సీ మహి ళకు రిజర్వు చేయడంతో ఎన్నికల్లో భార్య అరుణను వట్టిచె రుకూరు జడ్పీటీసీ స్థానం నుంచి పోటీ చేయించారు. వైకాపా ప్రభుత్వ హయాంలో 2021లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో తెదేపా మద్దతుతో అనంతవరప్పాడు సర్పంచిగా వెంకట్రావు విజయం సాధించారు..
జిల్లా సర్పంచ్ల్ సంఘం ఉపాధ్యక్షుడిగా కూడా వ్యవహరించారు. అప్పటి వైకాపా ప్రభుత్వం 15వ ఆర్ధిక సంఘం నిధులను పంచాయతీలకు విడుదల చేయకుండా దారి మళ్లించేయ డంతో సర్పంచ్ల సంఘం ఆధ్వర్యంలో పోరాడారు. దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్మంతర్లో నిర్వహించిన నిరస నలో పాల్గొన్నారు. రాజధాని అమరావతి పరిరక్షణ కోసం రైతులతో కలిసి దిల్లీ వెళ్లి సంఘీభావం తెలిపారు.