Sattenapalli: చెదరని బాల్య స్మృతులు.. ఒకే వేదికపై డైరెక్టర్, డీఎస్పీ, డీఈఓ

Sattenapalli: పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని శ్రీ శరభయ్య హైస్కూలు 1979-80 పదవ తరగతి పూర్వ విద్యార్థుల 4వ ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది.

Update: 2026-08-02 13:46 GMT

Sattenapalli: చెదరని బాల్య స్మృతులు.. ఒకే వేదికపై డైరెక్టర్, డీఎస్పీ, డీఈఓ

సత్తెనపల్లి: కాలచక్రం పరుగులు పెడుతున్నా, నాటి బాల్యపు జ్ఞాపకాలు మాత్రం చెదరవని నిరూపించారు శ్రీ శరభయ్య హైస్కూలు 1979-80 విద్యా సంవత్సరపు పదవ తరగతి పూర్వ విద్యార్థులు. దశాబ్దాల తర్వాత సత్తెనపల్లి 4 వ సారి జరిగిన ఈ అపూర్వ సమ్మేళనం ఆసాంతం ఆత్మీయ వాతావరణంలో, ఉద్విగ్నభరితంగా సాగింది. ఈ వేడుకకు నలుమూలల నుంచి తరలివచ్చిన నాటి మిత్రులు ఒకరినొకరు కలుసుకుని పరస్పరం ఆలింగనం చేసుకుంటూ చిన్ననాటి మధుర స్మృతుల్లో తేలియాడారు.

ప్రముఖుల సందడి - ఆత్మీయ పరామర్శలు ఈ సమ్మేళనానికి వివిధ రంగాల్లో ఉన్నత స్థానాలను అలంకరించిన నాటి సహచరులు ముఖ్య అతిథులుగా విచ్చేసి వేడుకను మరింత ప్రత్యేకంగా నిలిపారు.

ప్రముఖ ఫిల్మ్ డైరెక్టర్ సి.డి. ప్రసాద్ (CD Prasad) తన సినీ లోకపు అనుభవాలను, బడి ఈడు నాటి జ్ఞాపకాలను మిత్రులతో పంచుకుని నవ్వులు పూయించారు.

జమ్మలమడుగు డీఎస్పీ వెంకటేశ్వరావు హాజరై, నాటి మిత్రులతో కలిసి గడిపిన క్షణాలను గుర్తుచేసుకుంటూ భద్రతా వాతావరణంలో పరస్పర ఆప్యాయతలను పంచుకున్నారు.

పల్నాడు డీఈఓ పి.వి.జె. రామారావు (PVJ Ramarao) విద్యారంగానికి తాను సేవనందించడంలో నాటి ఈ పాఠశాల అందించిన పునాదే కారణమని భావోద్వేగానికి గురయ్యారు.

వీరితో పాటు ప్రముఖులు దేసు శేఖర్, కామేశ్వరరావు, త్రిపురుమల్లు మల్లేశ్వరరావు తదితరులు ఈ ఆత్మీయ సమ్మేళనంలో ఉత్సాహంగా పాల్గొని చిన్ననాటి కబుర్లతో సందడి చేశారు.

Tags:    

Similar News