Palnadu: క్రోసూరులో గాలివాన బీభత్సం.. ఆలయ ధ్వజస్తంభం కుప్పకూలింది!

Palnadu: పల్నాడు జిల్లా క్రోసూరు మండలంలో గాలివాన బీభత్సం. విరిగిపడిన ఆలయ ధ్వజస్తంభాలు, భారీ వృక్షాలు.

Update: 2026-05-27 05:28 GMT

Palnadu: క్రోసూరులో గాలివాన బీభత్సం.. ఆలయ ధ్వజస్తంభం కుప్పకూలింది!

పల్నాడు జిల్లా: క్రోసూరు మండలంలో మంగళవారం రాత్రి వీచిన ఈదురుగాలులు జనాన్ని భయాందోళనలకు గురిచేశాయి. ఈ గాలివాన ధాటికి మండలంలోని పలు ప్రాంతాల్లో భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి.​ముఖ్యంగా క్రోసూరు పరిధిలోని ఆలయాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఊటుకూరు గ్రామంలో రోడ్డు పక్కన ఉన్న బ్రహ్మంగారి దేవస్థానంతో పాటు, అనంతవరంలో ఉన్న ప్రసన్నాంజనేయ స్వామి ఆలయ ధ్వజస్తంభం ఈదురుగాలుల ధాటికి ఒక్కసారిగా విరిగి కిందపడిపోయింది. రాత్రి సమయంలో ఈ ప్రమాదం జరగడంతో భక్తులెవరూ అక్కడ లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పిందని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు ఊటకూరు, విప్పర్ల, క్రోసూరు మధ్య ప్రధాన రహదారులపై పెద్ద పెద్ద చెట్లు అడ్డంగా విరిగిపడ్డాయి. విప్పర్ల బస్ షెల్టర్ సమీపంలో తుమ్మచెట్లు విద్యుత్ స్తంభాలపై పడటంతో స్తంభాలు విరిగిపోయి వైర్లు తెగిపడ్డాయి. దీనితో క్రోసూరు మండలంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయి చీకట్లు అలుముకున్నాయి.

Tags:    

Similar News