Addanki: అద్దంకి బస్టాండ్లో గుర్తు తెలియని వ్యక్తి మృతి
Addanki: ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణం ఆర్‌టీసీ బస్టాండ్ ప్రాంగణంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.
Addanki: అద్దంకి బస్టాండ్లో గుర్తు తెలియని వ్యక్తి మృతి
ప్రకాశం జిల్లా: అద్దంకి పట్టణం RTC బస్టాండు ప్రాంగణం లో ఇంకొల్లు బస్సులు ఆగే ప్రాంతం వద్ద ఓ గుర్తు తెలియని వ్యక్తి, బెంచీ పై పడుకుని ఉండడం గమనించిన RTC సిబ్బంది, అతన్ని తట్టి లేపిన లెగవ పోవడంతో 108కి సమాచారం ఇచ్చారు. స్థానిక అద్దంకి 108 అంబులెన్సు సిబ్బంది అక్కడకు వెళ్లి పరీక్షంచగా, అప్పటికే అతను మృతి చెందినట్లు నిర్దారించారు. మృతదేహాన్ని అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వివరాలు సేకరిస్తున్నారు పోలీసులు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.