Guntur: యూరియా అమ్మలేం బాబోయ్. గుంటూరు జిల్లాలో చేతులెత్తేసిన డీలర్లు!

Guntur: గుంటూరు జిల్లాలో యూరియా విక్రయాలపై డీలర్లు చేతులెత్తేశారు. రవాణా, కూలీల భారం వల్ల ప్రభుత్వ ధరకే అమ్మలేమంటున్న డీలర్లు; రైతులపై పడుతున్న ప్రభావం.

Update: 2026-08-27 03:44 GMT

Guntur: యూరియా అమ్మలేం బాబోయ్. గుంటూరు జిల్లాలో చేతులెత్తేసిన డీలర్లు!

Guntur: యూరియా అమ్మలేం బాబోయ్ రూ.266.50కు గిట్టుబాటు కాదంటూ చేతులెత్తేసినడీలర్లు రవాణా, దింపుడు కూలీల భారం ఆందోళనలో కొంతమంది మంది డీలర్లు రైతులకు అందాల్సిన యూరియా విక్రయాలపై ఉమ్మడి గుం టూరు జిల్లాలో డీలర్లు చేతులెత్తేశారు...

ప్రభుత్వం నిర్ణయించిన రూ.266.50 ధరకు యూరియా విక్రయిస్తే తమకు నష్టాలు తప్పవని,.. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ధర పెంచి విక్రయిస్తే లైసెన్సులు రద్దు చేయడంతో పాటు కేసులు నమోదు చేస్తామని... అధికారులు హెచ్చరిస్తున్నారని డీలర్లు వాపోతున్నారు.... దీంతో అసలు యూరియా జోలికి వెళ్లకుండా ఉండటమే మేలని పలువురు డీలర్లు భావిస్తున్న పరిస్థితి నెలకొంది.

ప్రభుత్వం ఒక్కో యూరియా బస్తాను రూ.266.50కే రైతులకు విక్రయించాలని స్పష్టం చేస్తోంది... అయితే కంపెనీల నుంచి డీలర్లకు యూరియా బస్తా సుమారు రూ.245 నుంచి రూ.248కే వస్తున్నప్ప టికీ,... అసలు భారం అక్కడితో ముగియడం లేదని డీలర్లు చెబుతు న్నారు... కంపెనీలు యూరియా నిల్వలను ర్యాక్ పాయింట్ వరకు మా త్రమే తీసుకువచ్చి వదిలేస్తుండటంతో.

అక్కడి నుంచి తమ గోదా ములకు తరలించేందుకు ఒక్కో బస్తాపై రూ.35 నుంచి రూ.45 వర కు రవాణా ఖర్చు భరించాల్సి వస్తోందంటున్నారు... దీనికి అదనంగా బస్తాలను దింపేందుకు దింపుడు కూలీ సుమారు రూ.15 వరకు చె ల్లించాల్సి వస్తోందని చెబుతున్నారు.

రవాణా, దింపుడు కూలీతో పా టు ఇతర నిర్వహణ ఖర్చులను కలుపుకుంటే ప్రభుత్వం నిర్ణయించిన రూ.266.50 ధరకు యూరియాను విక్రయించడం వల్ల... తమకు పెట్టు తిరిగి వచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కనీసం రూ.300 వరకు విక్రయిస్తే తప్ప గిట్టుబాటు కాదని డీలర్లు. అంటున్నారు... అయితే ప్రభుత్వం నిర్ణయించిన ధరకు మించి విక్ర యిస్తే కఠిన చర్యలు తప్పవన్న హెచ్చరికలతో డీలర్లు తీవ్ర సందిగ్ధం లో పడ్డారు... ఉమ్మడి గుంటూరు జిల్లాలో సుమారు 1500 మంది ఎరువుల డీలర్లు ఈ సంకట స్థితిని ఎదుర్కొంటున్నారని డీలర్ల వర్గా లు చెబుతున్నాయి.

రైతులకు అవసరమైన సమయంలో యూరియా సరఫరా చేయాల్సిన బాధ్యత తమపై ఉన్నప్పటికీ, ప్రతి బస్తాపై నష్టాన్ని భరించి వ్యాపారం కొనసాగించడం సాధ్యం కాదని వారు స్పష్టం చేస్తున్నారు...  డీలర్లు యూరియా కొనుగోళ్లకు దూరంగా ఉంటే దాని ప్రభావం నేరుగా రైతులపై పడే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

ముఖ్యంగా పంటలకు యూరియా అవసరమయ్యే సమయంలో డీలర్లు స్టాక్ తీసుకోవడానికి వెనుకంజ వేస్తే స్థానికంగా యూరియా లభ్యత సమస్యగా మారే ప్రమాదం ఉందని రైతు సంఘాల ప్రతినిధులు అంటున్నారు.

Tags:    

Similar News