Chirala: ఫిషింగ్ హార్బర్ పనులను త్వరగా పూర్తి చేయాలి..ఎమ్మెల్యే!
Chirala: చీరాల సహా రాష్ట్రంలోని ఫిషింగ్ హార్బర్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అసెంబ్లీలో కోరిన ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య యాదవ్.
Chirala: ఫిషింగ్ హార్బర్ పనులను త్వరగా పూర్తి చేయాలి..ఎమ్మెల్యే!
Chirala: ఫిషింగ్ హార్బర్ పనులను త్వరితగతిన పూర్తి చేసి మత్స్యకారులకు అందుబాటులోకి తీసుకురావాలి: ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య
అమరావతి,,,: చీరాల నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలోని మత్స్యకారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఫిషింగ్ హార్బర్ల అభివృద్ధి, నిర్మాణ పనులపై చీరాల ఎమ్మెల్యే శ్రీ మద్దులూరి మాలకొండయ్య యాదవ్ గారు ఈరోజు అసెంబ్లీలో ప్రశ్నించారు.
ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం పూర్తయితే మత్స్యకారులకు చేపల వేట, నిల్వ, రవాణా, మార్కెటింగ్‌కు మెరుగైన సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని, తద్వారా వారి ఆదాయం మరియు జీవనోపాధి మెరుగుపడుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
హార్బర్ల నిర్మాణ పనుల్లో ఎటువంటి జాప్యం లేకుండా మిగిలిన పనులను వేగవంతం చేసి, మత్స్యకారులకు పూర్తి స్థాయి మౌలిక వసతులు అందుబాటులోకి తీసుకురావాలని ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య యాదవ్ గారు ప్రభుత్వాన్ని కోరారు. చీరాల నియోజకవర్గ మత్స్యకారుల సమస్యలకు శాశ్వత పరిష్కారం కల్పించేందుకు తాను నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.