Bapatla: బాపట్లలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎందుకు జరగలేదు.. అన్నం సతీష్!
Bapatla: బాపట్లలో గడచిన ఐదేళ్లలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎందుకు జరగలేదో మాజీ ఎమ్మెల్యే కోన రఘుపతి సమాధానం చెప్పాలని మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ డిమాండ్ చేశారు.
Bapatla: బాపట్లలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎందుకు జరగలేదు.. అన్నం సతీష్!
Bapatla: గడచిన ఐదు సంవత్సరాలలో బాపట్ల మున్సిపాలిటీ ని అడ్డగోలుగా వైసీపీ మాజీ ఎమ్మెల్యే కోన రఘుపతి దోచుకున్నడని మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ ఆరోపించారు. బాపట్లలో నేడు జరిగిన విలేకరుల సమావేశంలో అన్నం సతీష్ ప్రభాకర్ మాట్లాడుతూ బాపట్ల మున్సిపాలిటీలో ప్రజాధనాన్ని కొల్లగొట్టింది కోన రఘుపతని సతీష్ స్పష్టం చేసారు.
ప్రజాభిప్రాయం లేకుండా వార్డుల పునఃవిభజన ఎందుకు జరిపారని ఆయన ప్రశ్నించారు. పునర్విభజన జరగటం వల్ల పల్లె ప్రాంత ప్రజలకు ఎటువంటి లాభం ఉందని ఆయన కోనరఘుపతిని ప్రశ్నించారు. వార్డులను విభజన చేసింది కోన ఆ విషయాన్ని వైకాప నాయకులతో మళ్ళీ కోర్టులో వేయించింది కూడా కోనా రఘుపతి అని సతీష్ స్పష్టం చేశారు.
బాపట్ల పురపాలక సంఘానికి గడచిన ఐదు సంవత్సరాలలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎందుకు జరగలేదో కోన రఘుపతి సమాధానం చెప్పాలని సతీష్ ప్రశ్నించారు. కేవలం తన ఏకపక్ష పాలన సాగాలని స్థానిక సంస్థల ఎన్నికలు వైకాపా ప్రభుత్వంలో బాపట్ల పట్టణం లో జరగనివ్వలేదని సతీష్ మాట్లాడారు.
గత ఐదు సంవత్సరాలలో వైసిపి ప్రభుత్వం లో మాజీ ఎమ్మెల్యే కోన రఘుపతి ప్రజాధనాన్ని కొల్లగొడుతూ ప్రభుత్వ రేషన్ బియ్యం,మరియు ఇసుక మాఫియా భారీ స్థాయిలో చేశారని తెలిపారు. బాపట్ల కు 150 ఎకరాలలో మంచినీటి చెరువు ఏర్పాటు చేస్తానని కోన రఘుపతి ప్రజలకు వాగ్దానం చేశారు.
కనీసం దాన్ని పట్టించుకున్న దాఖలాలు కోన రఘుపతికి లేదని సతీష్ మాట్లాడారు. కేవలం తన సొంత రాజకీయ లబ్ధి కోసం అమాయకపు ప్రజలను కోన మోసం చేశారని వెల్లడించారు. ప్రజలందుకే కోన రఘుపతి తగిన గుణపాఠం చెప్పారని సతీష్ తెలియజేశారు. బాపట్లలో రియల్ ఎస్టేట్ వ్యాపారుల దగ్గర ఎకరానికి 10 లక్షల రూపాయలు తీసుకున్న ఘనత కోన రఘుపతికి ఉందని సతీష్ ఆరోపించారు.
వైకాపా ప్రభుత్వంలో బాపట్లకు జగనన్న కాలనీ అంటూ ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ప్రజలను మోసం చేశారని ఆయన అన్నారు. ఇళ్ల స్థలాలు శాంక్షన్ విషయంలో కూడా కోన రఘుపతి కమిషన్ తీసుకున్నాడని సతీష్ మాట్లాడారు. ఇచ్చిన స్థలాలకు ఇప్పటివరకు కనీసం రోడ్ల నిర్మాణం లేదు మంచినీటి,సరఫరా లేదని ఆయన తెలియజేశారు.
బాపట్ల కు జిల్లా తీసుకువచ్చామని కోన రఘుపతి ఎన్నో ప్రకాంపణలు పలికారు.. కానీ బాపట్ల జిల్లా ఎవరికి అవసరం అంటూ ఆయన మాట్లాడారు. బాపట్ల జిల్లా రావడం వలన జిల్లా అధికారులంతా బాపట్లలో ఉంటున్నారు. అయితే బాపట్లలో ఉన్న పురపాలక సంఘ శానిటేషన్ వర్కర్లంతా జిల్లా అధికారుల ఇళ్లల్లో పనిచేస్తున్నారు తప్ప బాపట్ల పురపాలక సంఘాన్ని పట్టించుకోవడంలేదని సతీష్ అన్నారు.
గత ప్రభుత్వంలో కోన చేసిన అరాచకాలు వలన వైకాపని బాపట్ల నుండి పంపించామని సతీష్ తెలియజేశారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు కూడా గతంలనే ఉన్నాయని సతీష్ మాట్లాడారు. రాబోయే రోజుల్లో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సతీష్ ప్యానల్‌ని బాపట్ల ప్రజలు ఆశీర్వదించాలని అన్నం సతీష్ ప్రభాకర్ తెలియజేశారు.
సతీష్ ప్రభాకర్ ప్యానెల్ నుండి చైర్మన్ అభ్యర్థి గా ప్యార్లి సునీల్ ఉంటున్నట్లు ఆయన తెలిపారు. ప్రజలంతా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఆయన అన్నారు.