Bapatla: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో గంటా ఆదర్శ్ సాయి భేటీ!

బాపట్ల: కాంగ్రెస్ పార్టీతోనే దేశం ముందుకు సాగుతుందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పిసిసి జనరల్ సెక్రటరీ గంటా అంజిబాబు తనయుడు గంటా ఆదర్శ్ సాయి అన్నారు. బుధవారం కాంగ్రెస్ పార్టీ భారత దేశ అధ్యక్షుడు కార్గేను గంటా ఆదర్స్ సాయి మర్యాదపూర్వకంగా కలిశారు. దేశంలోని రాజకీయ పరిస్థితులపై కార్గేతో ఆదర్శ్ సాయి చర్చించారు.

దేశం ఎంతో వెనకబడి ఉందని, అభివృద్ధి సంక్షేమలో రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వంతో ముందుకు తీసుకెళ్లాలని కార్గేతో ఆదర్స్ సాయి మాట్లాడరు. ఈ సందర్భంగా ఆదర్స్ సాయి మాట్లాడుతూ దేశంలో ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందో రాష్ట్రాలు కూడా అభివృద్ధి సంక్షేమాలతో పరుగులు తీస్తాయని ఆయన అన్నారు.

కులాలను మతాలను అడ్డం పెట్టుకొని అధికారంలో కి రావాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి లేదని ఆయన అన్నారు. రాబోయే రోజుల్లో యువతంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దేశంలో జరుగుతున్న అనేక తప్పిదాలపై గంట ఆదర్స్ సాయి కార్గేతో చర్చలు జరిపారు. కచ్చితంగా 2029లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడం లక్ష్యంగా దేశంలోని ప్రజలంతా అడుగులు వేస్తున్నారని గంట ఆదర్స్ సాయి తెలియజేశారు.

Tags: