Mangalagiri: ఎయిమ్స్ వైద్య సేవలపై లంకా దినకర్ క్షేత్రస్థాయి పరిశీలన
Mangalagiri: మంగళగిరి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) హాస్పిటల్‌ను 20 సూత్రాల కార్యక్రమ అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ సందర్శించారు.
Mangalagiri: ఎయిమ్స్ వైద్య సేవలపై లంకా దినకర్ క్షేత్రస్థాయి పరిశీలన
మంగళగిరి: ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS )ఎయిమ్స్ హాస్పిటల్ ను 20 సూత్రాల కార్యక్రమం అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ నేడు అధికారులతో కలిసి సందర్శించారు. ఎయిమ్స్ హాస్పిటల్ పని తీరు రోగులకు అందుతున్న సేవలు తదితర విషయాలను ఆయన క్షుణంగా పరిశీలించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన పదవీ కాలాన్ని విజయవంతంగా 12 సంవత్సరాలు పూర్తిచేసి విజయవంతంగా దేశ ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించారని
అలాగే కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో రెండు సంవత్సరాలు కాలం పూర్తి చేసుకోవటం శుభసూచకమని దినకర్ కొనియాడారు. ఇప్పటివరకు ఎంతమంది రోగులు ఇక్కడ వైద్యం పొందారు, వారు ఎలాంటి నాణ్యమైన సేవలు పొందుతున్నారని, రోగులను అడిగి తెలుసుకున్నారు. సదుపాయాల గురించి ప్రతి విషయాన్ని ఆయన యాజమాన్యం ని అడిగి తెలుసుకున్నారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ వికసిత్ భారత్ లో భాగంగా భారతదేశం పలు రంగాల్లో ముందుకు వెళుతుందని ముఖ్యంగా నరేంద్ర మోడీ నాయకత్వంలో సమర్థవంతంగా దేశం ముందుకు వెళుతుందని దినకరన్ తెలియపరిచారు. రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలను వాటి పనితీరును ఈయన పరిశీలించనున్నారు.