Vinukonda: వినుకొండ జెడ్పీ గర్ల్స్ హైస్కూల్‌కు ట్రిపుల్ ఐటీ సీట్ల పంట.. ఏకంగా 10 మందికి ఛాన్స్!

Vinukonda: పల్నాడు జిల్లా వినుకొండ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినులు సరికొత్త రికార్డు సృష్టించారు.

Update: 2026-06-15 11:23 GMT

Vinukonda: వినుకొండ జెడ్పీ గర్ల్స్ హైస్కూల్‌కు ట్రిపుల్ ఐటీ సీట్ల పంట.. ఏకంగా 10 మందికి ఛాన్స్!

వినుకొండ: పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి, పదో తరగతి మార్కుల ఆధారంగా నిర్వహించిన ఎంపికల్లో పాఠశాలకు చెందిన 10 మంది విద్యార్థులు ట్రిపుల్ ఐటీ సీట్లు సాధించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు.

శ్రీమతి బి. శైలజ కుమారి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె అధ్యక్షతన ట్రిపుల్ ఐటీ లో సీట్లు సాధించిన విద్యార్థులకు సోమవారం అభినందన సభ నిర్వహించారు.ఈ సందర్భంగా వినుకొండ మండల విద్యాశాఖ అధికారి సయ్యద్ జఫరుల్లా మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు తమ ప్రతిభతో ఉన్నత విద్యా అవకాశాలను అందిపుచ్చుకుంటూ సత్తా చాటుతున్నారని అన్నారు.

ఉర్దూ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు ఎం. విజయభాస్కర్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు సీహెచ్. వీరప్పయ్య పాల్గొని విద్యార్థులను అభినందించారు.నూజివీడు ఐఐఐటీలో ఎస్.కె. కూష్నిమ్, ఎస్.కె. మౌలాబి, బి. రవళి; ఆర్‌కే వ్యాలీ ఐఐఐటీలో పి. అమిరున్, ఏ. ఝాన్సీ లక్ష్మి, కె. సాయి వర్షిణి, ఐ. సాయి లక్ష్మి, పి. హారిక మైత్రి; ఒంగోలు ఐఐఐటీలో బి. శ్రావణి, సీహెచ్. వెంకటకృష్ణ గోపిక సీట్లు సాధించారు. వీరిని ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు.

Tags:    

Similar News