Bank Jobs: ప్రభుత్వం బ్యాంకుల్లో కొలువుల జాతర ..ఏకంగా 13 వేల ఉద్యోగాలు

Bank Jobs: ప్రభుత్వ రంగా బ్యాంకులు మాత్రం నిరుద్యోగులకు కొలువుల జాతరతో ఊరటనిచ్చాయి.

Update: 2026-06-12 01:59 GMT

Bank Jobs: ప్రభుత్వం బ్యాంకుల్లో కొలువుల జాతర ..ఏకంగా 13 వేల ఉద్యోగాలు

Bank Recruitment: సాఫ్ట్‌వేర్ రంగంలో అడుగుపెడితే చాలు.. జీవితం సెటిల్ అయిపోతుంది అనుకున్న రోజులు మారుతున్నాయి. ఓవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శరవేగంగా విస్తరిస్తుండటంతో, గ్లోబల్ కార్పొరేట్ కంపెనీలు ఉన్న ఉద్యోగులను ఇంటికి పంపించే పనిలో పడ్డాయి. ఐటీ ఉద్యోగుల్లో లేఆఫ్స్ గుబులు రేపుతున్నాయి. కానీ.. సరిగ్గా ఇలాంటి సమయాల్లోనే నిరుద్యోగులకు, ముఖ్యంగా బ్యాంకింగ్ రంగాన్ని నమ్ముకున్న యువతకు ప్రభుత్వ రంగ బ్యాంకులు కొలువుల జాతరతో ఒక సూపర్ గుడ్ న్యూస్ మోసుకొచ్చాయి.

తాజా నివేదికల ప్రకారం.. దేశవ్యాప్తంగా ప్రభుత్వరంగ బ్యాంకుల్లో రిక్రూట్‌మెంట్ ప్రక్రియ జెట్ స్పీడ్‌తో దూసుకుపోతోంది. సాంకేతికత, డిజిటలైజేషన్ పెరుగుతున్నప్పటికీ.. కస్టమర్ల అవసరాలు, సేవల విస్తరణే లక్ష్యంగా బ్యాంకులు భారీగా సిబ్బందిని నియమించుకుంటున్నాయి. గడిచిన 2025-26 ఆర్థిక సంవత్సరంలో దేశంలోని మొత్తం 12 ప్రభుత్వరంగ బ్యాంకులకు గానూ.. కేవలం ఎనిమిది బ్యాంకులు ఏకంగా 13,223 కొత్త నియామకాలను చేపట్టాయి. దీంతో ప్రభుత్వ బ్యాంకుల్లో పనిచేసే సిబ్బంది సంఖ్య గణనీయంగా పెరిగింది.

2024-25 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి దేశంలోని ప్రభుత్వ బ్యాంకుల్లో మొత్తం ఉద్యోగుల సంఖ్య 6,14,980 గా ఉండేది. 2026 మార్చి 31 నాటికి ఈ కొత్త నియామకాలతో ఆ సంఖ్య ఏకంగా 6,28,203 కు చేరుకుంది. ఈ కొత్త కొలువుల కల్పనలో దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అగ్రస్థానంలో నిలిచింది. సరికొత్త బ్రాంచీల విస్తరణ, రిటైల్ బ్యాంకింగ్ కార్యకలాపాలను పెంచడం కోసం SBI అత్యధిక సంఖ్యలో కొత్త సిబ్బందిని రిక్రూట్ చేసుకుంది. ఎస్‌బీఐతో పాటు బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్ వంటి మరో ఏడు బ్యాంకులు ఈ నియామకాల జాతరలో కీలక పాత్ర పోషించాయి.

ఈ పోస్టులు అన్నీ కూడా ప్రధానంగా ప్రొబేషనరీ ఆఫీసర్స్ , క్లర్కులు, స్పెషలిస్ట్ ఆఫీసర్స్ కేటగిరీల్లో జరగడం విశేషం. ప్రభుత్వ బ్యాంకుల్లో ఈ స్థాయిలో సిబ్బంది సంఖ్య పెరగడం వల్ల బ్యాంకింగ్ సేవల నాణ్యత మరింత మెరుగుపడనుంది. అంతటితో ఆగకుండా, రాబోయే రోజుల్లో మరిన్ని నోటిఫికేషన్లు వచ్చే అవకాశం బలంగా ఉందంటూ మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. సో.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల మాంద్యం చూసి బెంగపడాల్సిన పనిలేదు. పక్కా ప్లానింగ్‌తో ప్రిపేర్ అయితే.. ప్రభుత్వ బ్యాంక్ ఉద్యోగం మీ సొంతం కావడం ఖాయం.

Tags:    

Similar News