Kadapa: కడప జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత ఇసుక టిప్పర్ ఢీకొని ఇద్దరు దుర్మరణం!

Kadapa: టి.సుండుపల్లి వద్ద ఇసుక టిప్పర్ ఢీకొని చిన్నగొల్లపల్లికి చెందిన రవి, జయ మృతి. బాధితులకు న్యాయం చేయాలని కడప జిల్లాలో రోడ్డుపై గ్రామస్తుల ఆందోళన.

Update: 2026-07-22 05:48 GMT

Kadapa: కడప జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత ఇసుక టిప్పర్ ఢీకొని ఇద్దరు దుర్మరణం!

Kadapa: కడప జిల్లా టి.సుండుపల్లి మండలం ఉప్పరపల్లి సమీపంలోని చండ్రాయుడు స్వామి ఆలయం ఎదుట బుధవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో చిన్నగొల్లపల్లి గ్రామానికి చెందిన రవి , జయ అనే ఇద్దరు

వ్యక్తులు ద్విచక్ర వాహనదారులు అక్కడికక్కడే మృతి చెందారు. అతివేగంగా వచ్చిన ఇసుక టిప్పర్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు గ్రామస్తులు , కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై ఆగ్రహించిన కుటుంబ సభ్యులు, గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు.

Tags:    

Similar News