Shamshabad: అప్ప జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదం.. బీటెక్ యువకుడు మృతి!
Shamshabad: నార్సింగి పిఎస్ పరిధిలోని అప్ప జంక్షన్ వద్ద డివైడర్‌ను ఢీకొని బీటెక్ యువకుడు వికాస్ మృతి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
Shamshabad: అప్ప జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదం.. బీటెక్ యువకుడు మృతి!
Shamshabad: డివైడర్‌ను ఢీకొని బీటెక్ యువకుడు మృతి. నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జగిత్యాల ప్రాంతానికి చెందిన బండా వికాస్ (యువకుడు) ద్విచక్ర వాహనంపై వెళ్తూ అప్ప జంక్షన్ వద్ద డివైడర్‌ను ఢీకొని మృతి చెందాడు.
బీటెక్ పూర్తి చేసిన వికాస్ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ సన్‌సిటీలో తన మిత్రులతో కలిసి అద్దెకు ఉంటున్నాడు. ఆదివారం రాత్రి ద్విచక్ర వాహనంపై బయటకు వెళ్లి వస్తానని చెప్పి వెళ్లిన వికాస్.. అప్ప జంక్షన్ వద్ద అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు. తీవ్ర గాయాల కారణంగా అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.
సమాచారం అందుకున్న నార్సింగి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.