Madanapalle: బస్సు-బైక్ ఢీ.. ఇద్దరు విద్యార్థులకు గాయాలు
Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లె సమీపంలోని చెన్నమర్రిమిట్ట క్రాస్ వద్ద ఆర్టీసీ బస్సు, బైక్ ఢీకొన్నాయి.
Madanapalle: బస్సు-బైక్ ఢీ.. ఇద్దరు విద్యార్థులకు గాయాలు
Madanapalle: కొరకులకోట మండలం చెన్నమర్రిమిట్ట క్రాస్ వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొని ఇద్దరు యువకులు గాయపడ్డారు. ఆదిత్య కాలేజీలో పరీక్ష రాసి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. సత్యసాయి జిల్లా కదిరి మండలం కొట్టాలకు చెందిన యశ్వంత్ (19), సంతోష్ (18) గాయపడగా స్థానికులు వారిని మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం సంతోష్ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించినట్లు వైద్యులు తెలిపారు.